Share News

Pawan On volunteers: అవన్నీ గుర్తున్నాయి కాబట్టే మళ్లీ వచ్చా

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:57 AM

Pawan On volunteers: గత ప్రభుత్వం వాలంటీర్లను త్రిశంఖ చక్రంలో పడేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌లో వాలంటీర్లకు సంబంధించి మాట్లాడటానికి ఎలాంటి అవకాశం కనిపించడం లేదన్నారు.

Pawan On volunteers: అవన్నీ గుర్తున్నాయి కాబట్టే మళ్లీ వచ్చా
Pawan On volunteers

అరకు జిల్లా , ఏప్రిల్ 8: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) అరకు పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు డుంబ్రిగుడ మండలం కురిది గ్రామం రచ్చబండలో పవన్ పాల్గొని ప్రసంగించారు. వాలంటీర్లకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ఆధారం లేకుండా చేశారని.. మంత్రి నారా లోకేష్‌తో (Minister Nara lokesh) కేబినెట్‌లో చర్చించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. వాలంటీర్లకు జీతాలు కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వలేదన్నారు. వాలంటీర్ల జీతాలు ఎలా ఇచ్చారో తెలీదని... మీకు సంబంధించిన వాలంటీర్ నాయకులను జీతాలు ఎలా ఇచ్చారో అడిగి తెలుసుకోవాలని ప్రజలకు తెలిపారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) దృష్టిలో మాత్రమే కాకుండా కేబినెట్ దృష్టిలో పెడతానన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లను త్రిశంఖ చక్రంలో పడేశారని వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను తీసుకున్నప్పుడు సేవ చేయడానికి అని పెట్టారన్నారు. కేబినెట్‌లో వాలంటీర్లకు సంబంధించి మాట్లాడటానికి ఎలాంటి అవకాశం కనిపించడం లేదన్నారు. వాలంటీర్ల పేరుతో ఉద్యోగాలు అని చెప్పి మాయ చేశారని.. ఇప్పటికే 25 వేల కోట్లు దోచేశారని ఆరోపించారు.


సికిల్ సెల్ ఏనిమియా వ్యాధి బాధితులకు బ్లడ్ అవసరమని.. సీఎస్‌ఆర్ నిధులతో అయినా ఏర్పాటు చేయాలన్నారు. సికిల్ సెల్ ఏనిమియా వ్యాధి డ్రైవ్ చేసి గుర్తించాలని... దీనిని కేబినెట్ దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పారు. సీఎం చంద్రబాబుతో చర్చించి అంగన్వాడీలతో పోషక పదార్థాలు అందించడానికి ప్రయత్నం చేస్తానన్నారు. 2018లో వచ్చినప్పుడు విన్న అన్ని సమస్యలు తన గుర్తు ఉన్నాయని.. కాబట్టే మళ్ళీ వచ్చానని తెలిపారు. సికిల్ సెల్ ఏలేమియా వ్యాధికి సంబంధించి సీఎంకు అవగాహన ఉందన్నారు.

Dilsukhnagar Bomb Blast Case: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు


2.50 వేల ఎకరాల భూమిలో కాఫీ పంట వేస్తున్నామన్నారు. ఇక్కడ ఉన్న భూములను అందరికి అందుబాటులోకి వచ్చేలా చేస్తున్నామన్నారు. దింసా డాన్స్ చేసే వాళ్లకు, ఉసిరి, స్టాబేర్రి, లాంటి పంటలు వేసి ఉమ్మడి సాగు చేస్తే జాతీయ ఉపాధి హామీ పధకం నుంచి నిధులు తీసుకువచ్చి డెవలప్ చేస్తామన్నారు. అటవీ శాఖ, మార్కెటింగ్ శాఖ ద్వారా పండించిన పంటలను విశాఖలో మార్కెటింగ్ చేస్తానని తెలిపారు. కురిడి గ్రామాన్ని ప్రయోగాత్మకంగా ఎంచుకుని వాణిజ్య పంటలు పండించాడానికి మార్గాలు వెతుకుతామన్నారు. నరేగా జాతీయ ఉపాధి హామీ పధకం నుండి నిధులు తీసుకువచ్చి పంచాయితీ రాజ్ శాఖ ఉపాధి కల్పిస్తామని తెలిపారు. సినిమా వాళ్లకు, టీవీ సీరియల్ వారికి అవకాశం ఉండేలా వసతులు ఏర్పాటు చేయాలన్నారు. టూరిజం శాఖ నుంచి పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వస్తామని చెప్పారు.


కుల ధ్రువీకరణ పత్రాలు కోసం చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని.. ఈరోజు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానన్నారు. వ్యాసనాలు, గంజాయి వద్దు, గంజాయి కంటే తులసి మొక్క నాటడం మంచిదని సూచించారు. కురిడి గ్రామానికి అధికారులను పంపిస్తానని.. అరకు, పాడేరుకు సంబంధించి పరిశ్రమలు ఏర్పాటు చేయలేమని తెలిపారు. టూరిజంలా గ్రామ దేవతల ఆలయాలను సాంస్కృతిక శాఖతో కలిపి అభివృద్ధి చేయడానికి చూస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతం అందాలు పెరిగేలా చూడాలి తప్ప అందం పోయేలా ఉండకూడదన్నారు. తాను గిరిజనుడిగా పుట్టలేదు కానీ ఆలోచన ఉందన్నారు. కేరళ టూరిజం మోడల్‌ను దృష్టిలో పెట్టుకుని అరకు టూరిజం కూడా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కురిడి గ్రామానికి వ్యక్తిగతంగా ఐదు లక్షలు ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదం.. ఏమైందంటే..

Controversy: సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే

Read Latest AP News and Telugu News

Updated Date - Apr 08 , 2025 | 11:57 AM