మందుబాబులపై డ్రోన్ పడగ!
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:42 AM
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై పోలీసులు ‘డ్రోన్’ పాదం మోపుతున్నారు. డ్రోన్ల సాయంతో ఏజెన్సీలో గంజాయి సాగును గుర్తిస్తున్నట్టుగానే ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారిని, పేకాట, కోడిపందేలు వంటి జూదాలు ఆడేవారిని గుర్తించి పట్టుకోవడానికి డ్రోన్లను వాడుతున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని పట్టుకోవడానికి పోలీసు శాఖ వినియోగం
వెదురుపర్తిలో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పేకాట, కోడిపందేల శిబిరాలు డ్రోన్‌తో గుర్తింపు
అచ్యుతాపురం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై పోలీసులు ‘డ్రోన్’ పాదం మోపుతున్నారు. డ్రోన్ల సాయంతో ఏజెన్సీలో గంజాయి సాగును గుర్తిస్తున్నట్టుగానే ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారిని, పేకాట, కోడిపందేలు వంటి జూదాలు ఆడేవారిని గుర్తించి పట్టుకోవడానికి డ్రోన్లను వాడుతున్నారు. గురువారం మండలంలోని వెదురుపర్తి పంచాయతీ పరిధిలో వున్న ఇళ్ల స్థలాల లేవుట్లలో మద్యం సేవిస్తున్న నలుగురిని డ్రోన్ సాయంతో గుర్తించారు. అనంతరం పోలీసులు వాహనంలో అక్కడకు వెళ్లి మందు బాబులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ నమ్మి గణేశ్ మాట్లాడుతూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని డ్రోన్ సహాయంతో పట్టుకొంటున్నామని తెలిపారు. ఇకపై ప్రతి రోజు ఇదే విధంగా డ్రోన్‌లతో గస్తీ నిర్వహిస్తామన్నారు. రాత్రి వేళ కూడా స్పష్టంగా కనిపించే కెమెరాలు వున్న డ్రోన్లను వినియోగిస్తున్నామని సీఐ తెలిపారు.