MP Krishnaiah: చంద్రబాబు, పవన్‌పై ఎంపీ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Jan 08 , 2025 | 10:31 AM
విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు విజనరీ ఉన్న నేతని, సంపద సృష్టించి పేదరికాన్ని రూపుమాపాలని ఆలోచించే నాయకుడని అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంచి హృదయం ఉన్న నాయకుడని, పేద ప్రజలను చూస్తే కరిగిపోయే మనస్సున్న నేతని అన్నారు.
విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy Pawan Kalyan)పై బీజేపీ రాజ్యసభ ఎంపీ (BJP MP) ఆర్ కృష్ణయ్య (R.Krishnaiah) కీలక వ్యాఖ్యలు (Key Comments) చేశారు. ఏపీలో చంద్రబాబు పాలన బాగుందని.. ఆయన మంచి పరిపాలన దక్షుడని.. విజనరీ ఉన్న నేతని... సంపద సృష్టించి పేదరికాన్ని రూపుమాపాలని ఆలోచించే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. మేధావులలోనూ, విద్యావేత్తలలో చంద్రబాబుపై మంచి అభిప్రాయం ఉందన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంచి హృదయం ఉన్న నాయకుడని, పేద ప్రజలను చూస్తే... కరిగిపోయే మనస్సున్న నేత పవన్ కల్యాణ్ అని ఆర్ కృష్ణయ్య అన్నారు. కాగా సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి విశాఖకు వస్తున్నారని, ప్రధానికి నీరాజనం పట్టడానికి విశాఖ ప్రజలు సిద్దం అయ్యారన్నారు. విశాఖ ప్రాంతం అభివృద్దికి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత భారత్ అన్నిరంగాలలో గణనీయమైన అభివృద్దిని సాధిస్తోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాని దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తామని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు.
కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) బుధవారం విశాఖ (Visakha) పర్యటనకు (Visit) వస్తున్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను మరో ఎత్తుకు చేర్చుతూ రూ.రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటుచేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువే రూ.1.85లక్షల కోట్లు. రహదారులు, రైల్వే పనుల అంచనా రూ.19.5 వేల కోట్లు. వీటితోపాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. కొత్తగా నిర్మించిన, విస్తరించిన ఆరు రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. ప్రధాని వెంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ మార్గంలోని రహదారిని ప్రత్యేక బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 1.5 లక్షల మందిని సమీకరిస్తున్నారు. సభ వేదికపై మోదీతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు, పవన్‌కల్యాణ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యుడు సుందరపు విజయకుమార్ ఉంటారు. ప్రధానికి కుడి వైపున గవర్నర్, ఎడమ వైపున ముఖ్యమంత్రికి సీట్లు కేటాయించారు. పవన్‌కల్యాణ్, చంద్రబాబు ప్రసంగించిన తరువాత ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకాలు ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తారు. ప్రధాని ప్రసంగాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అనువదిస్తారు.
శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు..
ప్రధాని మోదీ విశాఖ సభా వేదికగా 12కు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఆరుకు పైగా రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పనుల విలువ దాదాపు రూ. రెండు లక్షల కోట్ల పైమాటే. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్‌టీపీసీ రూ.1.85 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు. 57 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టును 1,600 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణరథం
రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు
కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటా: కేటీఆర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 08 , 2025 | 10:31 AM