Share News

డిప్యూటీ మేయర్లుపైనా అవిశ్వాసం

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:28 AM

జీవీఎంసీ డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, కటుమూరి సతీ్‌షపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూటమి కార్పొరేటర్లు బుధవారం ఇన్‌చార్జి కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిరప్రసాద్‌కు నోటీస్‌ అందజేశారు. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాసం ప్రకటిస్తూ కూటమి కార్పొరేటర్లు ఇప్పటిక నోటీస్‌ ఇచ్చారు. ఈ మేరకు ఈనెల 19న మేయర్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

డిప్యూటీ మేయర్లుపైనా అవిశ్వాసం

జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌,

జిల్లా కలెక్టర్‌కు నోటీసులు అందజేసిన

కూటమి కార్పొరేటర్లు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, కటుమూరి సతీ్‌షపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూటమి కార్పొరేటర్లు బుధవారం ఇన్‌చార్జి కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిరప్రసాద్‌కు నోటీస్‌ అందజేశారు. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాసం ప్రకటిస్తూ కూటమి కార్పొరేటర్లు ఇప్పటిక నోటీస్‌ ఇచ్చారు. ఈ మేరకు ఈనెల 19న మేయర్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా డిప్యూటీ మేయర్లు ఇద్దరిపై అవిశ్వాస తీర్మానానికి నోటీస్‌ ఇవ్వడంతో 19న జరిగే కౌన్సిల్‌ సమావేశంలోనే ఈ అంశం కూడా తేలిపోయే అవకాశం ఉందంటున్నారు. నోటీస్‌ అందజేసిన అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మాదిరిగానే జీవీఎంసీలో కూడా కూటమి పాలన ఉండాలని నగరవాసులు కోరుకుంటున్నారన్నారు. అందుకోసమే మేయర్‌తోపాటు డిప్యూటీ మేయర్లపైనా అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చామన్నారు. జీవీఎంసీలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ గత నాలుగేళ్లలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌లు, వైసీపీ ఫ్లోర్‌లీడర్‌ పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని, అందుకే అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావుతోపాటు టీడీపీ, జనసేన కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 01:28 AM