Share News

పాడేరు మార్కెట్‌ చింతపండు మయం

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:21 AM

స్థానిక మార్కెట్‌కు మంగళవారం చింతపండు అధిక మొత్తంలో వచ్చింది. వివిధ గ్రామాల నుంచి చింతపండును గిరిజన రైతులు ఇక్కడ విక్రయించేందుకు తీసుకువచ్చారు.

పాడేరు మార్కెట్‌ చింతపండు మయం
పాడేరు మార్కెట్‌కు మంగళవారం రైతులు తెచ్చిన చింతపండు

- వివిధ గ్రామాల నుంచి అధిక మొత్తంలో తెచ్చిన గిరిజనులు

- కిలో రూ.45 చొప్పున వర్తకులు కొనుగోలు

పాడేరు, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): స్థానిక మార్కెట్‌కు మంగళవారం చింతపండు అధిక మొత్తంలో వచ్చింది. వివిధ గ్రామాల నుంచి చింతపండును గిరిజన రైతులు ఇక్కడ విక్రయించేందుకు తీసుకువచ్చారు. దీంతో మార్కెట్‌ జరిగే స్థానిక పాతబస్టాండ్‌ ప్రాంతమంతా ఎక్కడికక్కడ తట్టలతో ఉన్న చింతపండే దర్శనమిచ్చింది. అలాగే ఇప్పుడిప్పుడే చింతపండు మార్కెట్‌లోకి వస్తుండడంతో వర్తకులు, వినియోగదారులు సైతం కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. పిక్కతో ఉన్న చింతపండును కిలో రూ.45 చొప్పున వర్తకులు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో ధర పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మార్కెట్‌కు మంగళవారం సుమారుగా 5 టన్నుల వరకు చింతపండు వచ్చిందని వర్తకులు అంచనాగా తెలిపారు.

Updated Date - Apr 02 , 2025 | 12:21 AM