సర్వేయర్ నుంచి పింఛన్ నగదు రికవరీ
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:13 PM
మండలంలోని తాజంగి గ్రామ సచివాలయం-2 సర్వేయర్ నుంచి పింఛన్ నగదు రికవరీ చేసినట్టు స్థానిక ఎంపీడీవో యూఎస్‌వీ శ్రీనివాసరావు తెలిపారు.

లబ్ధిదారులకు వచ్చే నెల పింఛన్‌తో కలిపి పంపిణీ
ఎంపీడీవో యూఎస్‌వీ శ్రీనివాసరావు
చింతపల్లి, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తాజంగి గ్రామ సచివాలయం-2 సర్వేయర్ నుంచి పింఛన్ నగదు రికవరీ చేసినట్టు స్థానిక ఎంపీడీవో యూఎస్‌వీ శ్రీనివాసరావు తెలిపారు. లబ్ధిదారులకు ఏప్రిల్ నెల పింఛన్ మే నెలతో కలిపి పంపిణీ చేస్తామన్నారు. తాజంగి గ్రామ సర్వేయర్ సాగిన రవికుమార్ ఈనెల 54 మందికి సంబంధించిన పింఛన్ నగదు తీసుకుని 40 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయని విషయం పాఠకులకు తెలిసిందే. ఈ మేరకు శనివారం ఎంపీడీవో విలేకరులతో మాట్లాడుతూ గ్రామ సర్వేయర్ పింఛన్ నగదు తిరిగి చెల్లించాలని షోకాజు నోటీసు జారీ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. శుక్రవారం రూ.లక్ష, శనివారం ఉదయం రూ.88వేలు వెల్ఫేర్ అసిస్టెంట్ పాంగి చిలకమ్మకు రవికుమార్ అందజేశాడన్నారు. ఈ నగదుని బ్యాంక్‌లో జమ చేశామన్నారు. లబ్ధిదారులకు ఈ పింఛన్ వచ్చే నెల అందజేస్తామన్నారు. కాగా, పోలీసులు ఇచ్చిన గడువు లోపల పింఛన్ నగదు చెల్లించడంతో గ్రామ సర్వేయర్‌పై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుని వెల్ఫేర్ అసిస్టెంట్ వెనక్కి తీసుకున్నారు. లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయకపోవడంపై అధికారులు శాఖపరమైన విచారణ చేపడుతున్నారు.