ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Visakha: ఏపీపై వరాల జల్లు.. రేపే ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

ABN, Publish Date - Jan 07 , 2025 | 03:06 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ రేపు (బుధవారం) రానున్నారు. విశాఖలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బహిరంగ సభ, రోడ్ షో ఏర్పాటు చేసింది.

Home Minister Vangalapudi Anitha

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) రేపు (బుధవారం) రానున్నారు. విశాఖ (Visakha)లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బహిరంగ సభ, రోడ్ షో ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు సైతం భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభా ఏర్పాటుకు సంబంధించి పనులు చకాచకా సాగుతున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత, పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సభా ఏర్పాట్లను పరిశీలించారు.


ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.."కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారిగా విశాఖకు ప్రధాని మోదీ వస్తున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తి అయ్యాయి. భద్రతాపరంగా ఎటువంటి ఇబ్బందులూ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కొన్ని లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఇస్తున్న బహుమతి. అందుకు ప్రతిఒక్కరూ మోదీకి అభినందలు తెలియజేయాలి. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాలి. రేపు నిర్వహించే కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని" కోరారు.


ప్రధాని ప్రారంభించే ప్రాజెక్టులు ఇవే..

విశాఖపట్నానికి బుధవారం వస్తున్న ప్రధాని మోదీ ఏకంగా రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. విశాఖపట్నం సమీపం పూడిమడక వద్ద జాతీయ హరిత హైడ్రోజన్‌ మిషన్‌ కింద మొదటి గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌‍కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అత్యాధునిక ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. 2030 నాటికి శిలాజేతర ఇంధన సామర్థ్యం 500 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించడానికి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.


అలాగే ఏపీలో చేపడుతున్న రూ.19,500 కోట్ల విలువైన రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనుండగా.. మరికొన్నింటిని ప్రారంభిస్తారు. విశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయానికి సైతం ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మరికొన్ని ఇతర ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లా నక్కపల్లి బల్క్‌ డ్రగ్‌ పార్క్, తిరుపతి జిల్లాలో చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ పరిధిలోని కృష్ణపట్నం క్రిస్‌ సిటీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. నేషనల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద క్రిస్‌ సిటీని గ్రీన్‌ ఫీల్డ్‌ ఇండస్ర్టియల్‌ స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.10,500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ACB RAIDS: ఫార్ములా ఈ కార్ రేస్.. ఏపీలో సోదాలు

Andhra Pradesh: దారుణం.. ప్రియురాలి తండ్రి కళ్ళల్లో కారం కొట్టి మరీ..

Updated Date - Jan 07 , 2025 | 03:39 PM