Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 27 , 2025 | 02:05 PM
Ayyanna Patrudu: ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టడానికి వచ్చిన వారికి పర్మిషన్లు ఇవ్వడానికి ఎందుకు ఎక్కువ సమయం పడుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. అనుమతులు ఇవ్వడానికి వన్ ఇయర్ కావాలా అని స్పీకర్ అడిగారు. వన్ వీక్‌లో ఎస్ ఆర్ నో చెప్పాలని అప్పుడే టూరిజం అభివృద్ధి చెందుతుందని అభిప్రాపడ్డారు. టెంపుల్ టూరిజం డెవలప్ మెంట్ చేయాలన్నారు.

విశాఖపట్నం, జనవరి 27: టూరిజానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని.. కానీ ఎందుకో ఎక్కువ అభివృద్ధి జరగలేదని ఎక్కడో ఫాల్ట్ ఉందని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు (AP Speaker Ayyanna Patrudu) అన్నారు. సోమవారం నాడు వైజాగ్ రీజినల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో ఏపీ స్పీకర్ మాట్లాడుతూ.. విశాఖ బెస్ట్ సిటి అని అయినా ఎందుకో అనుకున్నంత అభివృద్ధి జరగలేదన్నారు. నర్సీపట్నం 14 కిలోమీటర్ల దూరంలో లంబసింగి ఉందని.. అక్కడ సరైన వసతి లేదన్నారు. బాత్రూంలు లేవని. టూరిస్టులు ఎలా వస్తారని ప్రశ్నించారు. రాత్రికి నర్సీపట్నంలో ఉండి.. ఉదయం లంబసింగి కి వెళ్ళవల్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని టూరిజం మంత్రిని కోరుతున్నామన్నారు.
వన్‌వీక్‌లో చెప్పేయండి...
లంబసింగికి వచ్చిన వారు అల్లూరి స్మారక చిహ్నం దగ్గరకు వెళ్తారని తెలిపారు. లంబసింగి, అల్లూరి పార్క్ , బొజ్జన కొండని పర్యాక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. లంబసింగి నుంచి భద్రాచలం శ్రీరాముడు దేవాలయానికి వెళ్లే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. అరకు కాఫీ ఎంతో రుచిగా ఉంటుందని తెలిపారు. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వరకు నాలుగు లైన్లు రోడ్డు మంజూరు అయిందని.. ఈ మార్గమధ్యలో పర్యాటక అభివృద్ధి చేయాలని తెలిపారు. గాజువాకలో యారాడ బీచ్ చాలా అందమైన బీచ్ ఉందన్నారు. ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టడానికి వచ్చిన వారికి పర్మిషన్లు ఇవ్వడానికి ఎందుకు ఎక్కువ సమయం పడుతుందని ప్రశ్నించారు. అనుమతులు ఇవ్వడానికి వన్ ఇయర్ కావాలా అని స్పీకర్ అడిగారు. వన్ వీక్‌లో ఎస్ ఆర్ నో చెప్పాలని అప్పుడే టూరిజం అభివృద్ధి చెందుతుందని అభిప్రాపడ్డారు. టెంపుల్ టూరిజం డెవలప్ మెంట్ చేయాలన్నారు. నెగిటివ్ మైండ్ వదని పాజిటివ్ మైండ్‌తో విశాఖను అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు.
Jagan Case: జగన్ కేసులపై సుప్రీం కీలక ఆదేశాలు
ఒక పౌరుడిగా చెబుతున్నా...
ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు అందమైన బీచ్ ఉందని.. మధ్య మధ్యలో హాట్స్ వేసి పర్యాటకులను ఆకర్షించాలన్నారు. విశాఖ బీచ్‌కు ఎవరైనా టీ తాగడానికి వస్తారా అని ప్రశ్నించారు. గోవాకు ఎందుకు వెళ్తున్నారో అందరికీ తెలుసన్నారు. ‘‘మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి.. బీచ్‌లకు వైన్ తాగడానికి కాకుండా.. టీ తాగడానికి పర్యాటకులు వస్తారా ? బీచ్ వాలీ బాల్, బీచ్ కబడ్డీ పెట్టండి.. సోర్ట్స్ లవర్స్ ఆస్వాదిస్తారు. ట్రైబల్ ఏరియాలో కొన్ని నిబంధనలు సవరిస్తే బాగుంటుందనుకుంటున్నాను. ట్రైబల్స్ ఏరియాలో ట్రైబల్స్ ఎక్కువగా పెట్టుబడులు పెట్టగలరా? నాన్ ట్రైబల్స్ పెట్టుబడులు పెడితే తమ పెట్టుబడికి భద్రత ఉండదు ఏమో భయపడుతున్నారు. దీనికి ఏమైనా రెమిడి ఉందా? అధికారులు స్టడి చేయలి. నేను స్పీకర్ గా మాట్లాడడం లేదు...ఒక పౌరుడిగా మాట్లాడుతున్నాను’’ అని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ట్రంప్ సంచలన నిర్ణయం.. ఈ దేశాలకు సహాయం బంద్
సాయంత్రం 4 గంటలకు ఎండీకి సమ్మె నోటీసు..
Read Latest AP News And Telugu News