సీఐడీకి సూపర్‌బజార్ కేసు?
ABN , Publish Date - Apr 03 , 2025 | 01:21 AM
సూపర్‌బజార్ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టిన వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా సీఐడీని కోరాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. సూపర్ బజార్ స్థలాన్ని లీజుకు తీసుకున్న సంస్థ సోహాణి షాపింగ్‌మాల్ ముంబైకు చెందినది కావడం, ఢిల్లీలో ఉన్న బ్యాంకులో తనఖా పెట్టిన నేపథ్యంలో స్థానిక పోలీసుల కంటే సీఐడీకి అప్పగిస్తే బాగుంటుందని డీజీపీ సూచించారు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రస్తుత సూపర్‌బజార్ ఇన్‌చార్జి ఎండీ, జిల్లా సహకార అధికారి ప్రవీణ అమరావతిలో సీఐడీ డీజీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు.

విశాఖపట్నం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి):