Bright Future వ్యవసాయ, ఉద్యాన రంగాలతో ఉజ్వల భవిష్యత్
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:24 PM
Bright Future with Agriculture and Horticulture Sectors వ్యవసాయ, ఉద్యానవన రంగాలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో ఖరీఫ్ సాగు ముందస్తు ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతన పద్ధతులతో లాభసాటి పంటల ద్వారా రైతులకు అధిక ఆదాయం సమకూరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

గరుగుబిల్లి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ, ఉద్యానవన రంగాలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో ఖరీఫ్ సాగు ముందస్తు ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతన పద్ధతులతో లాభసాటి పంటల ద్వారా రైతులకు అధిక ఆదాయం సమకూరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తద్వారా వారి జీవనోపాధులు మెరుగుపడాలని ఆకాంక్షించారు. వరితో పాటు కంది, చిరుధాన్యాలు, నిమ్మగడ్డి, రాగులు తదితర పంటలకు జిల్లా అనుకూలమని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి అంతర పంటల దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిక్షణ కార్యక్రమాలు, ఆధునిక సాగు పద్ధతులపై రైతులను చైతన్యపర్చాలని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి ఆసక్తి ఉన్న వారికి అవగాహన కల్పిస్తే మెరుగైన ఫలితాలు సాధించొచ్చని చెప్పారు. సాగులో మెళకువలు, జీవామృతం వినియోగం, సబ్సిడీ, ఇతర పథకాల సమాచారాన్ని వాట్సాప్‌కు అనుసంధానిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ, ఉద్యాన , పశు సంవర్థకశాఖల అధికారులు కె.రాబర్ట్‌పాల్, బి.మాధవి, ఎన్.మన్మథరావు, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు సుధారాణి, కె.రామచంద్రరావు, కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.