Share News

ఇంటింటికీ తాగునీటి సౌకర్యం

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:10 AM

గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం కల్పిస్తామని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు.

ఇంటింటికీ తాగునీటి సౌకర్యం
ఇంటింటి కుళాయిలకు శంకుస్థాపన చేస్తున్న పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ

సీతంపేట రూరల్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం కల్పిస్తామని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. సీతంపే ట ఏజెన్సీ ప్రాంతంలోని కొత్తగూడ, దుగ్గి గ్రామాల్లో పీఎంజన్‌మన్‌ పథకం కింద రూ.18లక్షలతో మంజూరైన గ్రౌండ్‌ లెవెల్‌ వాటర్‌ ట్యాంక్‌, ఇంటింటికి మంజూరైన నీటి కుళాయి పథకానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిధు లు కేటాయిస్తుందని అన్నారు. మారుమూల గ్రామాలకు సీసీ రహదారులు, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం గిరిజనాభివృద్థిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

జనసేనలో చేరిక

సీతంపేట మండలంలోని దుగ్గి పంచాయతీ పరిధిలో గల పలు గిరిజన గ్రామాలకు చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరాయి. వీరంతా ఆదివా రం పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో సీతంపేట మండలంలో వైసీపీ ఖాళీ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఏఎంసీ చైర్మన్‌ బి.సంధ్యారాణి, జీసీసీ చైర్మన్‌ రామారావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ మధుసూదనరావు, ఏఈ సత్యం, జనసేన మండల అధ్యక్షుడు విశ్వనాథం, పవన్‌, కూటమి నాయకులు హెచ్‌.ప్రసాద్‌, ఎం.ప్రకాశం, అజయ్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:10 AM