Polamamba పోలమాంబ జాతర పది వారాల ఆదాయం రూ.కోటి
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:15 PM
Polamamba Jatara Generates ₹1 Crore Revenue in Ten Weeks ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవత శంబర పోలమాంబ పది వారాల జాతర మొత్తం ఆదాయం రూ.కోటి పైనే వచ్చినట్లు ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

మక్కువ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవత శంబర పోలమాంబ పది వారాల జాతర మొత్తం ఆదాయం రూ.కోటి పైనే వచ్చినట్లు ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.17 లక్షల 30 వేలు, ప్రత్యేక దర్శనం రూ.7.28 లక్షలు, కేశఖండన రూ.78 వేలు, మహాన్నదాన విరాళాలు రూ.9.91 లక్షలు వచ్చినట్లు పేర్కొన్నారు. లడ్డూ విక్రయంతో రూ.7.77 లక్షలు, పులిహోర ప్రసాదం ద్వారా రూ.5.66 లక్షలు, కొబ్బరి ముక్కల వేలం రూ.5 లక్షలు, చీరలు, ఇత్తడి సామగ్రి ద్వారా రూ.3 లక్షలు, తలనీలాలు వేలం రూ.3.37లక్షలు, వనంగుడి వద్ద దీపాల వేలం ద్వారా రూ.70 వేలు, లామినేషన్ ఫొటోల విక్రయంతో రూ.లక్షా 52 వేలు, హుండీల ఆదాయం ద్వారా రూ.45.11 లక్షలు సమకూరినట్లు వెల్లడించారు. మొత్తంగా రూ.1.07 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.