Share News

Village-Level Committees గ్రామస్థాయి కమిటీల ద్వారా జీడిపిక్కల కొనుగోలు

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:27 PM

Procurement of Cashew nuts through Village-Level Committees గ్రామస్థాయి కమిటీల ద్వారా జీడిపిక్కలను కొనుగోలు చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్‌ శ్రీవాత్సవ ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

  Village-Level Committees గ్రామస్థాయి కమిటీల ద్వారా జీడిపిక్కల కొనుగోలు
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో

పార్వతీపురం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): గ్రామస్థాయి కమిటీల ద్వారా జీడిపిక్కలను కొనుగోలు చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్‌ శ్రీవాత్సవ ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎనిమిది మండలాల్లో 20 గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా జీడి పిక్కలను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ నెల 9న సిబ్బందికి సంబంధిత యాప్‌పై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ నెల 10, 11 తేదీల్లో రస్తాకుంటుబాయిలో ఎనిమిది మండలాల విలేజ్‌ లెవెల్‌ కమిటీ సభ్యులకు కృషివిజ్ఞాన కేంద్రం శిక్షణ ఇస్తుందన్నారు. ఈ సమీక్షలో జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్‌, గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ సుధారాణి, వెలుగు ఏపీడీ వై.సత్యంనాయుడు, ఐటీడీఏ ఏపీవో మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 11:27 PM