Tenth evaluation begins టెన్త్ మూల్యాంకనం ప్రారంభం
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:45 PM
Tenth evaluation begins పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం మొదలైంది. విజయనగరంలోని సెయింట్ జోసెఫ్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో గురువారం ప్రారంభించారు.

టెన్త్ మూల్యాంకనం ప్రారంభం
1100 మంది సిబ్బంది నియామకం
పరిశీలించిన కలెక్టర్ ఆంబేడ్కర్
కలెక్టరేట్, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి):
పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం మొదలైంది. విజయనగరంలోని సెయింట్ జోసెఫ్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో గురువారం ప్రారంభించారు. ఇక్కడ 29 తరగతి గదుల్లో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈనెల 9 వరకు స్పాట్ మూల్యాంకనం కొనసాగుతుంది. ఇందుకోసం 117 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 702 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 234 మంది స్పెషల్ అసిస్టెంట్లు కలిపి 1100 మంది సిబ్బంది సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. ప్రతి అసిస్టెంట్ ఎగ్జామినర్‌కు రోజుకు 40 పేపర్లు చొప్పున ఇస్తారు. మొదటిరోజు తెలుగు పేపర్లు 1417, హిందీ 2179, గణితం 1934, ఫిజిక్స్ 1970, జీవశాస్త్రం 1458, సోషల్ 1238 పేపర్లు దిద్దారు. మూల్యాంకనం ప్రక్రియను కలెక్టర్ అంబేడ్కర్ పరిశీలించారు. జవాబు పత్రాలు దిద్దే ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించారు. తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట డీఈవో మాణిక్యంనాయుడు, ఎగ్జామ్స్ ఏసీ సన్యాసిరాజు, తహసీల్దార్ కూర్మనాథరావు ఉన్నారు.