Share News

95 శాతం పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Apr 02 , 2025 | 01:09 AM

జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ 95 శాతం పూర్త యింది. మంగళవారం మధ్యాహ్నం 90శాతం పింఛ న్లు పంపిణీ చేశారు.

95 శాతం పింఛన్ల పంపిణీ
పాలకొల్లు పట్టణంలో వృద్ధురాలికి పింఛన్‌ అందజేస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు

క్షేత్రస్థాయిలో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల, ఎమ్మెల్యేలు

లబ్ధిదారులతో మాట్లాడిన ప్రత్యేకాధికారి సూర్యకుమారి, కలెక్టర్‌ నాగరాణి

భీమవరంటౌన్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ 95 శాతం పూర్త యింది. మంగళవారం మధ్యాహ్నం 90శాతం పింఛ న్లు పంపిణీ చేశారు. గతంలో సాయంత్రానికి 90 శాతం పూర్తి చేయగలిగేవారు. వేలిముద్రల డివైజ్‌, సర్వర్‌ ఇబ్బందులతో పింఛన్ల పంపిణీ త్వరితంగా ముందుకు సాగేది కాదు. ఈ నెలలో పింఛన్ల పంపిణీ కి ప్రభుత్వం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డివైజ్‌లను సమకూర్చింది. దీనితో వేలి ముద్రలు త్వరితంగా తీసుకోవడంతో జిల్లాలో ఒక్కరోజే 95 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు, వీరవాసరం మండలం కొణితివాడలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయలు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, అర్జునడుపాలెంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలో 10 సచివాలయాల్లో ప్రయోగత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయ పలకరింపు వాయిస్‌తో వినిపించి పింఛన్లు అందించారు. అర్బన్‌లో 5, రూరల్‌ లో 5 సచివాలయాల్లో అందించారు.

సద్వినియోగం చేసుకోవాలి

భీమవరం టౌన్‌ / పాలకోడేరు: ట్రాన్స్‌జెండర్స్‌ సామాజిక పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రత్యేకాధికారి, మహిళా శిశు సంక్షేమ, దివ్యాం గులు, వయోవృద్ధుల శాఖల ప్రభుత్వ కార్యదర్శి ఎ.సూర్యకుమారి అన్నారు. భీమవరం పట్టణం దుర్గా పురం, పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో ఎన్టీ ఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్య క్రమం లో సూర్యకుమారి, కలెక్టర్‌ నాగరాణి స్వయంగా లబ్ధి దారులకు పింఛన్లు అందజేశారు. పింఛన్‌దారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మానసిక దివ్యాంగుడు, కిడ్నీ బాధిత మహిళను ఆరోగ్యంపై ఆరా తీశారు. గొల్లల కోడేరులో మహిళలను పింఛన్ల మొత్తాన్ని ఎలా సద్వినిచేసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పింఛన్లను పెద్ద మొత్తంలో పెంచి అండ గా నిలిచిందని లబ్ధిదారులకు ప్రత్యేకాధికారి వివరిం చారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్‌ఎస్‌ వేణుగోపాల్‌, భీమవరం మునిసిపల్‌ కమిషనర్‌ కె.రా మచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ ఏపీవో మురళీకృష్ణ, సచివాల య, రెవెన్యూ, మునిసిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 01:09 AM