ఆక్వా క్రాప్ హాలిడే ప్రకటిస్తాం
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:30 AM
ఆక్వా క్రాప్ హాలీడే దిశగా రైతులు నిర్ణయం తీసుకోనున్నారు.

13న భీమవరంలో ఆక్వా రైతు మహాసభ
పాలకొల్లు ఆక్వా సంఘ చైర్మన్ గాంధీ భగవాన్ రాజు
పాలకొల్లు రూరల్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ఆక్వా క్రాప్ హాలీడే దిశగా రైతులు నిర్ణయం తీసుకోనున్నారు. పాలకొల్లులో ఈ నెల 7న జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం ఆధ్వర్యంలో జరిగిన రైతు మహాసభలో క్రాప్ హలిడే నిర్ణయం తీసుకున్నారు. అమలు, విధి విధానాలు ఖరారు చేయడానికి ఈ నెల 13న మరోసారి సమావేశం కానున్నట్లు జైభారత్ క్షీరారామ ఆక్వా సంఘం చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. క్రాఫ్ హాలిడేపై సంఘ సభ్యులు, ముఖ్య నాయకులతో చర్చించామన్నారు. ఇద్దరు సభ్యులతో గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి చెరువులు, రైతుల వివరా లను నమోదు చేస్తామన్నా రు. హేచరీలు, రొయ్య కొనుగోలు చేసే ప్రాసెసింగ్ ప్లాంట్‌ల వరకూ సిండికేట్‌గా ఆక్వా రైతులను 30 ఏళ్లగా దోపిడీ చేస్తున్నారన్నారు. క్రాప్ హాలిడే ఒక గుణపాఠం కావాలన్నారు. సంఘం పరిధిలోని పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లో మూడు నెలలు క్రాప్ హాలిడే పాటిస్తామన్నారు. భీమవరంలో ఈనెల 13న డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామరాజు ఆధ్వర్యంలో జరిగే ఆక్వా రైతుల సమావేశానికి పెద్ద సంఖ్యలో రైతులు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సమావేశంలో సంఘ సభ్యులు పెన్మెత్స సత్యనారాయణరాజు, కర్నేన గౌరునాయుడు, మేడిద జాన్‌రాజు, రుద్రరాజు సత్యనారాయణరాజు, అంగర వరప్రసాద్, మేకా ఫణీంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.