సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:34 AM
నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించ నున్నారు. పీ4 కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు.

ఆగిరిపల్లి/నూజివీడు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించ నున్నారు. పీ4 కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ఈ మేరకు బుధవారం మంత్రి కె.పార్థసారథి అధికారు లతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి మాట్లాడు తూ సీఎం ఆగిరిపల్లిలో చేతివృత్తుల వారు, నాయీ బ్రాహ్మణులు, గొర్రెల కాపరులు, ఇతర చేతి వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న వారి పని స్థలాలకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటారన్నారు. ఎన్‌ఎస్‌పీ కాల్వను అభివృద్ధి పరిచేందుకు మైనర్ ఇరిగేషన్ రిహాబిలిటేషన్ ప్లాన్‌ను, ఆగిరిపల్లిలోని నరసింహస్వామి ఆలయ అభివృద్ధి, నూజివీడు రింగ్‌రోడ్డ్ ఏర్పాటు తది తర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాగా సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి బుధవారం సాయంత్రం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ శాఖల అధికారు లతో సమీక్ష జరిపారు. అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్ కిశోర్, జేసీ పి.ధాత్రిరెడ్డి, సబ్ కలెక్టర్ స్మరణ్‌రాజ్, ఇంటెలిజెన్స్ ఏఏస్పీ కృష్ణారావు ఇతర ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
––––––––––––––––––––––––––
సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ దాదాపు ఖరారైంది. ఆయన సుమారు రెండున్నర గంటల పాటు ఆగిరిపల్లిలో ఉండనున్నారు. శుక్రవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఆగిరిపల్లి సమీపంలోని వడ్డమాను వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆగిరిపల్లి చేరుకుని వివిధ కుల వృత్తులకు సంబంధించిన కుటుంబాలను వారి పని ప్రదేశంలో కలిసి వారి సమస్యలను తెలుసుకుంటా రు. అనంతరం ఆగిరిపల్లి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వడ్డమాను రోడ్డులో పార్టీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుని కార్యకర్తలతో సమావేశమవుతారు. అనం తరం అక్కడ నుంచి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని విజయవాడ బయలుదేరి వెళ్తారు.