దేశంలో కీలక వనరు భూమి
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:52 AM
దేశంలో ముఖ్యమైన వనరులలో భూమి చాలా కీలకమని డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరి కునాల్ సత్యార్థి అన్నారు.

డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి
తాడేపల్లిగూడెం అర్బన్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): దేశంలో ముఖ్యమైన వనరులలో భూమి చాలా కీలకమని డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరి కునాల్ సత్యార్థి అన్నారు. రాష్ట్రంలో రీసర్వే పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న తాడేపల్లిగూడెంలో ప్రజాభిప్రాయ సేకరణకు శుక్రవారం ఐఏఎస్ అధికారి నిరంజన్ కుమార్ సుధాన్ష్‌తో కలసి సత్యార్థి పాల్గొన్నారు. జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సత్యార్థి, సుధాన్ష్ రీ సర్వే వల్ల ఇ బ్బందులు, ప్రయోజనాలపై ఆరా తీశారు. రీ సర్వే, అధికారులకు అందజేసిన డాక్యుమెంట్‌ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే పురోగతి పై అధికారులను ఆరా తీశారు. అనంతరం రూ రల్ మండలం చినతాడేపల్లి, పెంటపాడు మం డలం కె.పెంటపాడులో నిర్వహించిన సమావే శంలో పాల్గొన్నారు. మండలంలో కూడా సర్వేపై అధికారుల పనితీరును అడిగి తెలుసు కున్నారు. మండలంలోని మ్యాప్ పరిశీలించి ఇప్పటివరకూ ఎన్ని గ్రామాలలో సర్వే జరిగింది, ఇంకా ఎన్ని గ్రామాల్లో జరగాల్సి ఉంది తెలుసుకున్నారు. చనిపోయినవారి పేర్లతో ఉన్న డాక్యుమెంట్ కల్గిన పొలాలను ఎలా సర్వే చేస్తున్నారు. సర్వే ముందు భూమి ఎలా ఉంది, తరువాత ఎలా ఉంది అనే అంశాలను తెలుసుకున్నారు.
రీ సర్వే సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరి కునాల్ సత్యార్థి, నిరంజన్‌కుమార్ సుధాన్ష్ ఏపీ నిట్‌లో నిర్వహిం చిన సమావేశంలో బొలిశెట్టి మాట్లాడారు. రీ సర్వేతో సరిహద్దు గొడవలు తగ్గుతాయన్నారు. రైతులకు మంచి చేద్దామనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రీ సర్వే చేయిస్తున్నారని తెలిపారు.
కార్యక్ర మంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ విద్యుల్లత, సర్వే డిపార్టమెంట్ డిప్యూటీ డైరెక్టర్ కుమార్, రాజమండ్రి ఆర్డీ బాలస్వామి, ఆర్డీవో ఖతీబ్ కౌసర్ బనో, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, మునిసిపల్ కమిషనర్ ఎం.ఏసుబా బు, తహసీల్దార్లు సునీల్‌కుమార్, సీతారత్నం తదితరులు పాల్గొన్నారు.