డిజిటల్ కష్టాలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:11 AM
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శనివా రం మధ్యాహ్నం మూడు గంటలపాటు డిజి టల్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మొరాయించిన బ్యాంకు సర్వర్లు
స్తంభించిన యూపీఐ లావాదేవీలు
నగదు బదిలీ కాక జనం పాట్లు
నరసాపురం టౌన్, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యో తి): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శనివా రం మధ్యాహ్నం మూడు గంటలపాటు డిజి టల్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్యాంకు సర్వర్లు పనిచేయకపోవడంతో ఫోన్ పే, గూగుల్ పే, ఇతర యూపీఐ లావాదేవీలన్నీ స్తంభించాయి. ఈ విషయం తెలియక బయటకు వెళ్లిన వినియోగదారులు నానా కష్టాలు పడ్డారు. ఆటో, కార్లకు కిరాయిలు ఇద్దామంటే పర్సు లేదు. మందులు కొందామంటే డబ్బులు లేవు. హోటల్‌లో తిని బిల్లు ఇద్దామన్న ఇదే పరిస్థితి. దీంతో కొంత మంది తెలిసిన వారి దగ్గర అప్పులు తెచ్చి బిల్లులు కట్టారు. మరికొందరు సాయంత్రం ఇస్తామని చెప్పి బయటపడ్డారు. మరికొందరు కొన్న వస్తువులు అక్కడ వదిలి ఇంటికొచ్చి డబ్బులు తీసుకుని వెళ్లి సరుకులు తెచ్చుకున్నారు. గతంలో ఇలాంటి ఆనుభవాలను చాలాసార్లు చూశారు. అయితే ఈ సారి ఎక్కువ గంటలపాటు నిలిచిపోవడం, అది కూడా ఉదయం సమయాల్లో పని చేయకపోవడంతో ఆర్ధిక ఇబ్బందుల్ని చూశారు.
యూపీఏ లావాదేవీలకు అలవాటు పడిన తర్వాత చాలా మంది చిన్న చిన్న పేమెంట్లకు యూపీఏ, ఫోన్‌పే ద్వారా చెల్లిస్తున్నారు. ఇలా సగటున రోజుకు రూ.100 నుంచి రూ.లక్ష వరకు లావా దేవీలు యూపీఏ ద్వారానే చేస్తున్నారు. చిల్లర సమస్య లేకపోవడం, చెల్లించినట్లు రికార్డుపరంగా ఉండటంతో చాలా మంది వీటికి అలవాటుపడ్డారు. అత్యధిక లావా దేవీలు ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకే ఉంటాయి. ఈ సమ యాల్లోనే ఎక్కువగా సర్వర్లు మొరాయిస్తు న్నాయి. అయితే ఈసారి బ్యాంకింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన ప్రధాన సర్వర్ల వద్దే సమస్య తలెత్త డంతో అన్ని బ్యాంకుల యూపీఏలు పని చేయలేదు. దీంతో ఎండల్లో నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.