ఆక్వా రైతులకు ప్రభుత్వం అండ
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:56 AM
మెరికా ఆంక్షలతో ఆక్వా రైతులు ఆందో ళన చెందనవసరం లేదని, మన ప్రాంత ఆక్వా ఉత్పత్తులకు ప్రపంచ దేశాల్లో డిమాండ్ ఉందని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు.

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు
ఉండిలో ఉమ్మడి జిల్లా ఆక్వా రైతుల సదస్సు
ఉండి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): అమెరికా ఆంక్షలతో ఆక్వా రైతులు ఆందో ళన చెందనవసరం లేదని, మన ప్రాంత ఆక్వా ఉత్పత్తులకు ప్రపంచ దేశాల్లో డిమాండ్ ఉందని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండిలో ఆదివారం జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతుల సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆక్వా కల్చర్ సుస్థిరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో చర్యలు చేపడతామని, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. మనదేశం లో ఆక్వా రైతులు పండించిన రొయ్యలు ఏదేశంవారికైనా అవసరమేనన్నారు. ఎన్నో దేశాలు మన రైతులు పండించిన రొయ్యలు కావాలని ఎగబడుతున్నా రన్నారు. పంట పండినప్పుడు రొయ్యల ధర తగ్గుగుతందని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్ట వలసివుందన్నారు. తాను సీఎంం దృష్టికి తీసుకుని వెళతానని ఆయన తెలిపారు. రాజ్యసభ సషభ్యుడు బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ ని యోజకవర్గంలో రు.80లక్షలతో ఆక్వా లేబ్‌రేటరీని ఏర్పాటుచేయడం అభినందనీ యమన్నారు. ఉండి కేవీకేలో ఆక్వా ల్యాబ్‌ను ఆధునీకరిస్తామన్నారు. ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ ఆక్వా రైతులకు మంచి రోజులు రానున్నాయన్నారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆక్వా రైతుల సదస్సులో వచ్చిన సమస్యలను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతానని తెలిపారు. ఈ నెల 15న కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమావేశంలో ఆక్వా రైతుల సమస్యలపై చర్చ జరుగుతుందన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ అధునాతన ఆక్వా ల్యాబ్‌లు రావాలన్నారు. ప్రస్తుతం రైతుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చిందని, సమస్యలు పరిష్కార మవుతాయన్నారు. సదస్సులో ఆక్వా రైతులు గాదిరాజు సుబ్బరాజు, వేగేశ్న సత్య నారాయణరాజు, నంబూరి గజపతిరాజు, తాడినాడ బాబు, గాంఽధీభగవన్‌రాజు, తులసి రాంబాబు, కునాధరాజు మురళీకృష్ణంరాజు, ముత్యాల రత్నం, రుద్రరాజు యువరాజు, మత్స్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.