Share News

డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి అవమానం

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:51 AM

పోలసానపల్లి గ్రామంలో ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి ఘోర అవ మానం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు అంబేడ్కర్‌ విగ్రహానికి చెప్పుల దండ వేయడంతో దళిత సంఘాలు మండిపడ్డాయి.

డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి అవమానం
పోలసానపల్లి రహదారిపై దళిత సంఘాల నాయకుల ధర్నా

భీమడోలు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి) : పోలసానపల్లి గ్రామంలో ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి ఘోర అవ మానం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు అంబేడ్కర్‌ విగ్రహానికి చెప్పుల దండ వేయడంతో దళిత సంఘాలు మండిపడ్డాయి. సోమవారం అంబేడ్కర్‌ జయం తి జరుగనున్న నేపథ్యంలో పోలసానపల్లి రహదారి పక్కనే కొత్త విగ్రహాన్ని ఏర్పాటుచే శారు. దీనిపై గుర్తుతెలియని వ్యక్తులు చెప్పుల దండ వేయడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ నేతృత్వంలో సీఐ విల్సన్‌ ఆధ్వ ర్యంలో క్లూస్‌ టీమ్‌తో దర్యాప్తును వేగవంతం చేశారు. ముగ్గురు అనుమానితులను అదుపు లోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే విగ్రహానికి అవమానం జరగడాన్ని పలు దళిత సంఘాలు ఖండించాయి. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వ హించాయి. నిదితులను శిక్షించాలంటూ ఽనినా దాలు చేశారు. దళిత సంఘ నేతలు సంతోష్‌కు మార్‌తో పాటు స్థానిక నేతలు ప్రత్తి మదన్‌, యుగంధర్‌, నాగేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 12:51 AM