Share News

YS Jagan: మళ్లీ లండన్‌ ప్రయాణం.. కోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్

ABN , Publish Date - Jan 03 , 2025 | 06:54 PM

YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్.. తన ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటన చేసేందుకు సిద్దమవుతోన్నారు. ఈ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు.

YS Jagan: మళ్లీ లండన్‌ ప్రయాణం.. కోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్
YCP Chief, Ex CM YS Jagan

హైదరాబాద్, జనవరి 03: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. మరో సారి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిద్దమవుతోన్నారు. ఈ నేపథ్యంలో తన విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ.. శుక్రవారం ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల.. అంటే జనవరి 11వ తేదీ నుంచి15వ తేదీ వరకు తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కుటుంబ సమేతంగా తాను లండన్ వేళ్లాలనుకొంటున్నట్లు వైఎస్ జగన్.. తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వైఎస్ జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐని కోర్టు ఆదేశించింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన అనంతరం కోర్టులో వాదనలు ప్రారంభంకానున్నాయి.

ఇదిలా ఉండగా.. వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎదుట హాజరుకానున్నారు. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని వాటాలను విజయసాయిరెడ్డి బలవంతంగా లాగేసుకున్నారంటూ గతంలో ఈడీకి కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈడీ.. విజయసాయిరెడ్డి మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించింది. అందులోభాగంగా సోమవారం తమ ఎదుట హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు.


గతేడాది ఎన్నికల్లో ఆంధ్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ పూర్తయింది. అనంతరం వైఎస్ జగన్ తన కుటుంబంతో కలిసి లండన్ పయనమైయ్యారు. ఎన్నికల ఫలితాల ముందు ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. దీంతో తమకు ప్రతిపక్ష హోదా కేటాయించాలంటూ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు.

Also Read: జేసీ ప్రభాకర్ రెడ్డికి వార్నింగ్

Also Read: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుందా?

Also Read: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం..


సభ్యుల బలం లేకుంటే.. ప్రతిపక్ష హోదా ఇవ్వలేమంటూ అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేశారు. దాంతో తమకు ప్రతిపక్ష హోదా కేటాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు అక్రమాస్తుల కేసులో గతంలో వైఎస్ జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో 16 నెలలు ఆయన చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.

Also Read: ప్రశాంత్ కిషోర్‌‌కి పెరుగుతోన్న మద్దతు

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్


అనంతరం బెయిల్‌పై ఆయన బయటకు వచ్చారు. ఇక ఆయన ఇద్దరు కుమార్తెలు ఒకరు లండన్‌లో మరొకరు యూఎస్‌లో ఉన్నారు. దాంతో వారి వద్దకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు నుంచి వైఎస్ జగన్ అనుమతి పొందాల్సి ఉంది. అయితే వైఎస్ జగన్ గత ఐదేళ్లు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో ఆయనకు డిప్లమాటిక్ పాస్ పోర్ట్ జారీ చేసింది. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమి పాలు కావడంతో.. ఆ పాస్ పోర్ట్ సైతం ఆటోమెటిక్‌గా రద్దు అయిన సంగతి తెలిసిందే.

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 03 , 2025 | 07:27 PM