ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: దువ్వాడ ఆడియో లీక్.. మొత్తం బూతు పురాణమే..

ABN, Publish Date - Mar 28 , 2025 | 08:36 PM

Duvvada Srinivas Audio: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఆడియోలో మొత్తం బూతుపురాణమే ఉంది. ఇంతకీ ఈ ఆడియోలో అవతివైపు ఎవరున్నారు.. అసలు మ్యాటర్ ఏంటి.. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

Duvvada Srinivas

అమరావతి, మార్చి 28: వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ మరోసారి ప్రధాన వార్తల్లో నిలిచారు. అయితే, ఈ సారి మాత్రం మాధురి వ్యవహారంలో కాదండోయ్.. తాజాగా ఆయన నోట నుంచి బయటపడిన ఆణిముత్యాలకు సంబంధించి ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వ్యవహారమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ మరోసారి తన దురుసుతనం ప్రదర్శించారు. ప్రభుత్వ అధికారిపై రెచ్చిపోయారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ బూతులు తిట్టారు. అధికారిని బెదిరించారు. తన నివాసానికి సంబంధించిన విద్యుత్ బిల్లు వ్యవహారమై దువ్వాడ ఇలా రెచ్చిపోయినట్లు తెలుస్తోంది.


టెక్కలి విద్యుత్ శాఖ ఏఈ మురళీకృష్ణ పట్ల వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారు. బూతుపురాణంతో రెచ్చిపోయారు. దువ్వాడ శ్రీనివాస్ నివాసానికి సంబంధించిన విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో రెచ్చిపోయిన దువ్వాడ.. విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి బండబూతులు తిట్టారు. తన ఇంటికే విద్యుత్ సరఫరా నిలిపివేస్తారా అంటూ అధికారులపై దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కలిలో ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానంటూ ఏఈని బెదిరించారు. అంతేకాదు. అంతు చూస్తానంటూ ఏఈ మురళీ కృష్ణపై రెచ్చిపోయారు.


అయితే, దువ్వాడ బెదిరింపులకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు రచ్చ రచ్చ అయ్యింది. ఆయన మాట్లాడిన మాటలన్నీ ఫోన్‌లో రికార్డ్ అయ్యాయి. ఆ ఆడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అదికాస్తా వైరల్ అవుతోంది. ఇప్పటికే అనేక వివాదాల్లో ఇరుక్కున్న దువ్వాడ.. ఇప్పుడు ఏఈని బెదిరించి మరో వివాదంలో చిక్కుకున్నారు. అధికారం ఉందనే అహంకారంతో ఏఈని బెదిరించిన దువ్వాడపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దువ్వాడ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Also Read:

42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..

మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు

కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 28 , 2025 | 10:02 PM