Financial Fraud: ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ సర్పంచి టోకరా
ABN , Publish Date - Feb 23 , 2025 | 03:54 AM
వైసీపీకి చెందిన సర్పంచి గత ప్రభుత్వంలో పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తానంటూ తమ నుంచి సుమారు రూ.12 లక్షలు వసూలు..

ఆట స్థలం కబ్జా చేసిన ఆ పార్టీ నాయకులు
టీడీపీ ప్రజావినతుల కార్యక్రమంలో ఫిర్యాదులు
అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): వైసీపీకి చెందిన సర్పంచి గత ప్రభుత్వంలో పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తానంటూ తమ నుంచి సుమారు రూ.12 లక్షలు వసూలు చేశాడని విజయనగరం జిల్లా గంట్యాల మండలం నరవ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని టీడీపీ నేతలను కోరారు.ట టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజావినతుల కార్యక్రమంలో మాజీ మంత్రి నెట్టెం రఘురాం, కురబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం కోటాలపల్లిలో ప్రభుత్వ పాఠశాల ఆటస్థలాన్ని వైసీపీ నాయకులు ఆక్రమించుకుని అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని పాఠశాల విద్యాకమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు.