YouTube Premium Free: జియో క్రేజీ ఆఫర్.. రెండేళ్లు యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ..
ABN, Publish Date - Jan 11 , 2025 | 09:29 PM
రిలయన్స్ జియో మరోసారి క్రేజీ ఆఫర్‌తో ముందుకొచ్చింది. జియోఫైబర్, ఎయిర్ ఫైబర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో కంపెనీ రెండేళ్ల పాటు యూట్యూబ్ ప్రీమియం సేవను పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త ఏడాది వేళ, సంక్రాంతి పండుగకు ముందు జియో (jio) మరో క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్ ఫైబర్ (AirFiber) లేదా జియో ఫైబర్ (JioFiber) కనెక్షన్ తీసుకున్న వారికి రెండేళ్ల YouTube ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా (YouTube Premium Free) అందించనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్‌ను మీరు ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో ఇక్కడ చూద్దాం.
ఈ ఆఫర్ ప్రయోజనం జియో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లకు మాత్రమే లభిస్తుంది. ఈ ఆఫర్ ఎంపిక చేసిన జియోఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్‌లతో ఇవ్వబడుతోంది. కంపెనీ ప్రకారం జియోఫైబర్, ఎయిర్ ఫైబర్ వినియోగదారులు రూ.888, రూ.1199, రూ.1499, రూ.2499, రూ.3499 ప్లాన్‌లు తీసుకున్న వారు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందుతారు.
ఈ ప్లాన్ ద్వారా మీరు..
ఈ ప్లాన్‌లు కాకుండా మీరు ఏదైనా ఇతర ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే, మీకు YouTube ప్రీమియం ప్రయోజనం లభించదు. యూట్యూబ్ ప్రీమియం సర్వీస్ ద్వారా యూజర్లకు యాడ్ ఫ్రీ వీక్షణ సౌకర్యం లభిస్తుంది. ఆఫ్‌లైన్ వీడియో డౌన్‌లోడ్, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియంకు ఉచిత యాక్సెస్ అందించబడతుంది. ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి ముందుగా మీరు పైన పేర్కొన్న ప్లాన్‌లలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవాలి. ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత, మై జియో ఖాతాలోకి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత యాప్ లేదా వెబ్‌సైట్‌లోని YouTube ప్రీమియం బ్యానర్‌పై క్లిక్ చేయండి.
YouTube ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధర
ఆ తర్వాత మీ YouTube ఖాతాకు సైన్ ఇన్ అవ్వండి. మీకు యూట్యూబ్ ఖాతా లేకపోతే ముందుగా YouTube ఖాతాను సృష్టించుకోండి. దీని తర్వాత మీరు రెండు సంవత్సరాల పాటు ఉచిత YouTube ప్రీమియం ప్లాన్‌ను ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం YouTube ప్రీమియం నెలవారీ ప్లాన్ ధర 159 రూపాయలు. వార్షిక ప్లాన్ ధర 1490 రూపాయలు. ఈ విధంగా చూస్తే కంపెనీ మీకు ఉచితంగా రూ.2980 ప్రయోజనాన్ని అందిస్తోంది.
ఫ్రీగా అంతరాయం లేకుండా
దీంతో మీరు ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ వినియోగదారులు ఎటువంటి ప్రకటనలు లేదా ఇతర అంతరాయాలు లేకుండా రెండు సంవత్సరాల పాటు YouTube ప్రీమియం సేవలను ఆస్వాదించవచ్చు. ఈ సేవలో మీరు వీడియో ప్రారంభంలో వచ్చే 10-20 సెకన్ల ప్రకటనలు కూడా చూడలేరు. ఎంచక్కా యాడ్ ఫ్రీ వీడియోలను చూడవచ్చు. ఇది తెలిసిన పలువురు వావ్ బాగుందని చెబుతున్నారు. అయితే ఇది కేవలం పోస్ట్ పెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ విషయంలో మీరు ఎమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇవి కూడా చదవండి:
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Tata Tiago: రూ. 7 లక్షలకే.. టాటా ఎలక్ట్రిక్ కార్...
Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ
Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News
Updated Date - Jan 11 , 2025 | 09:31 PM