Mobile Gaming: జియో గేమ్స్‌తో 7సీస్ జట్టు
ABN , Publish Date - Mar 01 , 2025 | 02:43 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్.. జియో గేమ్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.

ABN AndhraJyohty: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్.. జియో గేమ్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్య ఒప్పందం ద్వారా జియో ఖాతాదారులకు 7సీస్‌కి చెందిన క్యాజువల్, అడ్వెంచర్, పజిల్, స్పోర్ట్స్ టైటిల్స్‌తో కూడిన అన్ని రకాల గేమ్స్ తమ స్మార్ట్‌ఫోన్లు, సెట్ టాప్ బాక్స్ (ఎస్‌టీబీ) ద్వారా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం జియోగేమ్స్ లైబ్రరీలో ఏడు గేమ్స్ అందుబాటులో ఉండగా త్వరలో మరిన్ని గేమ్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.