మిత్సుబిషి కోసం అజాద్ ఇంజనీరింగ్ తయారీ కేంద్రం
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:48 AM
ప్రెసిషన్ ఇంజినీరింగ్‌లో సుప్రసిద్ధమైన అజా ద్ ఇంజనీరింగ్ కంపెనీ హైదరాబాద్‌లోని తునికిబొల్లారం లో మిత్సుబిషి హెవీ ఇండస్ర్టీస్ (ఎంహెచ్‌ఐ) కోసం లీన్ మాన్యుఫాక్చరింగ్...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రెసిషన్ ఇంజినీరింగ్‌లో సుప్రసిద్ధమైన అజా ద్ ఇంజనీరింగ్ కంపెనీ హైదరాబాద్‌లోని తునికిబొల్లారం లో మిత్సుబిషి హెవీ ఇండస్ర్టీస్ (ఎంహెచ్‌ఐ) కోసం లీన్ మాన్యుఫాక్చరింగ్ కేంద్రాన్ని ప్రారంభించింది. 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఎంహెచ్‌ఐ జీటీసీసీ బిజినెస్ డివిజ్ వైస్ ప్రెసిడెంట్ మసాహితో కటోకా, తెలంగాణ ప్రభు త్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, అజాద్ ఇంజనీరింగ్ చైర్మన్, సీఈఓ రాకేష్ చోప్దార్ ప్రారంభించారు. ఎంహెచ్‌ఐతో తాము దశాబ్ది కాలంగా సాగిస్తున్న ప్రయాణంలో ఇదొక మైలురాయి అని రాకేష్ చోప్దార్ అన్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 200 మంది వృత్తి నిపుణులు పని చేస్తున్నారంటూ సమీప భవిష్యత్తులో వీరి సంఖ్య మరెన్నో వందలకు పెరుగుతుందని చెప్పారు. ప్రపంచ తయారీ కేంద్రంగా భారతదేశానికి, ప్రత్యేకించి తెలంగాణకు పెరుగుతున్న ప్రాధాన్యతకు ఈ కేంద్రం ఏర్పాటు నిదర్శనమని జయేష్ రంజన్ అన్నారు.
Read Also : Jio partners: నిన్న ఎయిర్ టెల్, ఈరోజు జియో..స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం
ఈ మెషిన్ ఒక్కటి కొంటే.. ఇంట్లోనే రోజూ రూ.5000 సంపాదన.. చాలామందికి తెలియని టాప్ బిజినెస్ ఐడియా..