స్టార్‌లింక్‌తో జియో జట్టు
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:57 AM
భారత్‌లో స్టార్‌లింక్ ‘శాటిలైట్ ఆధారిత హైస్పీడ్ ఇంటర్నెట్’ సేవలందించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో భారత నం.1 ధనవంతుడు ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం సంస్థ...

ఎయిర్‌టెల్ బాటలో అంబానీ కంపెనీ
న్యూఢిల్లీ: భారత్‌లో స్టార్‌లింక్ ‘శాటిలైట్ ఆధారిత హైస్పీడ్ ఇంటర్నెట్’ సేవలందించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో భారత నం.1 ధనవంతుడు ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో బుధవారం భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్పేస్‌ఎక్స్ అనుబంధ విభాగమే స్టార్‌లింక్. కాగా, స్పేస్‌ఎక్స్‌తో భారతీ ఎయిర్‌టెల్ జట్టు కట్టిన మరుసటి రోజే రిలయన్స్ జియో కూడా ఇదే తరహా ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. భారత్‌లో సేవలందించేందుకు స్టార్‌లింక్‌కు ఇంకా అనుమతి లభించలేదు. ఇందుకు అవసరమైన లైసెన్సు పొందాక స్పేస్‌ఎక్స్‌తో భాగస్వామ్యం అమలవుతుందని జియో స్పష్టం చేసింది. ఈ భాగస్వామ్యం ద్వారా రిలయన్స్ జియో తన ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రిటైల్ స్టోర్లలో స్టార్‌లింక్ డివైజ్‌లతోపాటు సేవలను ఆఫర్ చేయనుంది. అంతేకాదు, ఆ డివైజ్‌ల ఇన్‌స్టాలేషన్, యాక్టివేషన్ సేవలను సైతం అందించనుంది. జియో, స్పేస్‌ఎక్స్ కలిసి ఇరువురి సేవలకు పరస్పరం దోహదపడే మార్గాలను అన్వేషించనున్నాయి.
విరోధులు
భాగస్వాములుగా..
తాజా భాగస్వామ్యాల ద్వారా బ్రాడ్‌బ్యాండ్ సేవల రంగంలో విరోధులు భాగస్వాములుగా మారారు. ఎందుకంటే, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు అవసరమైన స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలని జియో, ఎయిర్‌టెల్ డిమాండ్ చేయగా.. స్టార్‌లింక్ సహా ఇతర అంతర్జాతీయ సంస్థలు నేరుగా కేటాయింపులు జరపాలని కోరాయి. కాగా, అంతర్జాతీయంగా ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను నిర్దిష్ట ధరకు నేరుగా కేటాయించడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో విరోధాన్ని పక్కన పెట్టి స్టార్‌లింక్‌తో ఎయిర్‌టెల్, జియో జట్టు కట్టడం విశేషం.
Read Also :
ఈ మెషిన్ ఒక్కటి కొంటే.. ఇంట్లోనే రోజూ రూ.5000 సంపాదన.. చాలామందికి తెలియని టాప్ బిజినెస్ ఐడియా..