నాలుగో రోజూ నష్టపోయిన సెన్సెక్స్
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:51 AM
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లోనే ముగిసింది. నిస్తేజంగా సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 72.56 పాయింట్ల నష్టంతో 74,029.76 వద్ద ముగియగా నిఫ్టీ 27.40 పాయింట్ల నష్టంతో..

రూ.1.4 లక్షల కోట్లు హాంఫట్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లోనే ముగిసింది. నిస్తేజంగా సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 72.56 పాయింట్ల నష్టంతో 74,029.76 వద్ద ముగియగా నిఫ్టీ 27.40 పాయింట్ల నష్టంతో 22,470.50 వద్ద ముగిసింది. దీంతో బీఎ్‌సఈలో లిస్టెడ్ కంపెనీల షేర్ల మార్కెట్ క్యాప్ రూ.1.4 లక్షల కోట్లు దిగజారి రూ.392.84 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఒక దశలో 504.16 పాయింట్ల వరకు నష్టపోయి 73,598.16 పాయింట్ల ఇంట్రా డే కనిష్ఠ స్థాయిని తాకింది.
మ్యూచువల్ ఫండ్స్ జోరుకు బ్రేక్: ఫిబ్రవరి నెల కూడా దేశీయ మ్యూచువల్ ఫండ్ సంస్థలకు కలిసి రాలేదు. ఈ సంస్థలు నిర్వహించే ఈక్విటీ పథకాల్లోకి వచ్చే పెట్టుబడులు 26 శాతం తగ్గి రూ.29,303 కోట్లకు పడిపోయాయి. జనవరిలో నమోదైన రూ.39,688 కోట్లతో పోలిస్తే ఇది రూ.10,385 కోట్లు తక్కువ కాగా గత డిసెంబరులో వసూలైన రూ.41,156 కోట్లతో పోలిస్తే రూ.11,853 కోట్లు తక్కువ
Read Also : Jio partners: నిన్న ఎయిర్ టెల్, ఈరోజు జియో..స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం
ఈ మెషిన్ ఒక్కటి కొంటే.. ఇంట్లోనే రోజూ రూ.5000 సంపాదన.. చాలామందికి తెలియని టాప్ బిజినెస్ ఐడియా..