Womens: మహిళల కోసం కొత్త పథకం
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:35 PM
ప్రముఖ జీవిత బీమా సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ మహిళలకు ప్రత్యేకంగా రూపొందిన సూపర్‌ఉమన్ టర్మ్ (SWT) పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.

పుణె: ప్రముఖ జీవిత బీమా సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ మహిళలకు ప్రత్యేకంగా రూపొందిన సూపర్‌ఉమన్ టర్మ్ (SWT) పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం సాధారణ బీమా సేవలను అధిగమించి, టర్మ్ ఇన్సూరెన్స్ లాభాలతోపాటు మహిళలకు సంబంధించిన కీలక ఆరోగ్య సమస్యల కవరేజీ, పిల్లల సంరక్షణ ప్రయోజనం, ఆరోగ్య సంరక్షణ సేవలను సమగ్రంగా అందిస్తుంది. ఇది మహిళలతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తుందని సంస్థ తెలిపింది. కుటుంబ శ్రేయస్సులో మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు. వారి ఆర్థిక భవిష్యత్తును బలోపేతం చేస్తూ, జీవితంలో స్థిరత్వాన్ని అందించడం ద్వారా ఈ పథకం వారి ఆకాంక్షల సాధనలో తోడ్పడుతుంది.
పథకం గురించి:
పూర్తి ఆర్థిక రక్షణ: మహిళల ఆర్థిక అవసరాలను గుర్తించి, ఈ పథకం ఆధునిక జీవన విధానానికి అనుగుణంగా రూపొందించారు. పాలసీదారు మరణం సంభవించినప్పుడు, నామినీకి ఒకేసారి మొత్తం క్లెయిమ్ చెల్లిస్తారు.
కీలక ఆరోగ్య సమస్యల కవరేజీ: ఈ పథకం బ్రెస్ట్, సర్వికల్, ఒవేరియన్ క్యాన్సర్‌లతో సహా 60 రకాల క్రిటికల్ ఇల్‌నెస్‌లకు రక్షణ కల్పిస్తుంది. దీనితో మహిళలు ఆర్థిక భారం లేకుండా చికిత్సపై దృష్టి సారించవచ్చు.
పిల్లల సంరక్షణ: పిల్లల భవిష్యత్తు భద్రత కోసం ఈ పథకం చైల్డ్ కేర్ బెనిఫిట్‌ను అందిస్తుంది. ఊహించని పరిస్థితుల్లో కూడా, పిల్లల విద్య, ఇతర అవసరాల కోసం నెలవారీ స్థిర ఆదాయం అందుతుంది.
ఆరోగ్య సంరక్షణ సేవలు: ఈ పథకం సమగ్ర ఆరోగ్య తనిఖీలు, ఔట్‌పేషెంట్ కన్సల్టేషన్లు, గర్భధారణ సంబంధిత సహాయం, మానసిక శ్రేయస్సు కార్యక్రమాలు, పోషకాహార నిపుణుల మార్గదర్శనం వంటి సేవలను ఉచితంగా అందిస్తుంది.
“ఈ రోజుల్లో మహిళలు తమ ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు, ఆర్థిక స్వావలంబనపై దృష్టి సారిస్తున్నారు. ఈ మూడు అంశాలను ఒకే చోట అందించేలా సూపర్‌ఉమన్ టర్మ్ పథకాన్ని సిద్ధం చేశాం. మహిళలు తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ఆర్థిక భరోసాతో సామర్థ్యం పొందేలా, వారి ఆరోగ్య, కుటుంబ అవసరాలకు తగినట్లు ఈ పథకాన్ని వాడుకోవచ్చు” అని బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ & సీఈవో తరుణ్ చుగ్ తెలిపారు.
ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని రద్దు చేసిన బ్యాంక్ ఆఫ్ ఇండియా..
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా, 400 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ పథకం గరిష్టంగా 7.30% వడ్డీని అందించింది. అంతేకాక, షార్ట్-టర్మ్, మీడియం-టర్మ్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై వివిధ మెచ్యూరిటీ వ్యవధులకు వడ్డీ రేట్లను ఏప్రిల్ 15, 2025 నుంచి తగ్గించనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది.