Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.6కే డైలీ 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ ఇంకా..
ABN , Publish Date - Apr 14 , 2025 | 07:31 PM
బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) మరోసారి వినియోగదారులను ఆకట్టుకునేలా అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీర్ఘకాలిక, చౌక ధర, పూర్తి సేవల సమ్మేళనం కావాలని చూస్తున్నవారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ఆ ప్లాన్ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) యూజర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. తాజాగా వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన, అత్యంత చౌక ధరలో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో డేటాతోపాటు నిరంతర కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. దీర్ఘకాల వ్యాలిడిటీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. అంతేకాదు దీనిలో మెసేజులు, కాలింగ్త్, డేటా అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ ధర ప్రస్తుతం రూ.997కి అందుబాటులో ఉండగా, 160 రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీని అందించనుంది.
రోజుకు రూ.6.23 మాత్రమే
ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు రోజుకు సుమారు రూ.6.23 మాత్రమే ఖర్చు చేస్తారని చెప్పవచ్చు. అంటే 6 రూపాయలకే డైలీ 2 జీబీ డేటాతోపాటు కాలింగ్ సౌకర్యాలు లభిస్తాయి. ఇంత తక్కువ ధరల్లో ఏ ప్రైవేట్ టెలికాం సంస్థల ప్లాన్లు కూడా లేకపోవడం విశేషం. ఉదాహరణకు రిలయన్స్ జియో రూ.999 ప్లాన్‌లో కేవలం 98 రోజుల వ్యాలిడిటీతో మాత్రమే 2GB డేటాను అందిస్తుంది. కానీ బీఎస్‌ఎన్‌ఎల్ రూ.997 ప్లాన్‌లో 160 రోజుల వ్యాలిడిటీతో 2GB డేటాను ఇస్తుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఖర్చు తగ్గిస్తూ, సేవలను మెరుగుపరచే దిశగా బీఎస్‌ఎన్‌ఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో టెలికాం సేవలను చవకగా అందించడంలో బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి ముందడుగు వేసింది.
వాణిజ్య అవసరాలకు
ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. డేటా పూర్తయిన తర్వాత కూడా 40kbps వేగంతో అపరిమిత డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇది తక్కువ వేగంతో అయినా ఇంటర్నెట్ సేవలను కొనసాగించడానికి సహాయపడుతుంది. దీంతోపాటు అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఇది వ్యక్తిగత, వాణిజ్య అవసరాల కోసం కూడా అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు రోజుకు 100 ఉచిత SMSలు కూడా లభిస్తాయి. ఇది బ్యాంకింగ్ OTPలు, అధికారిక కమ్యూనికేషన్, వ్యక్తిగత సందేశాల కోసం ఉపయోగపడుతుంది.
ఇతర సేవలు కూడా..
రూ.997 ప్లాన్‌లో అదనంగా కొన్ని వినోద సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్ ప్రత్యేక రింగ్‌టోన్ సేవలు, హార్డీ గేమ్స్, ఛాలెంజెస్ అరీనా గేమ్స్, ఆస్ట్రోటెల్, గేమ్ఆన్, గేమియం వంటి గేమింగ్ సేవలు, లిస్టెనిన్ పాడ్‌కాస్ట్ సేవలు కూడా లభిస్తాయి. బీఎస్‌ఎన్‌ఎల్ దేశవ్యాప్తంగా 65,000 కంటే ఎక్కువ 4G టవర్లను ఏర్పాటు చేసింది. తద్వారా వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీ, వేగవంతమైన మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తుంది. ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేయడానికి మీరు బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్-కేర్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఇవి కూడా చదవండి:
Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి
Forex vs Credit Card: జీరో ఫారెక్స్ కార్డ్ vs క్రెడిట్ కార్డ్..వీటిలో ఏది బెస్ట్ ఛాయిస్
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
Read More Business News and Latest Telugu News