Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
ABN , Publish Date - Feb 18 , 2025 | 06:34 PM
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ప్రైవేట్ కంపెనీలకు సవాల్ విసురుతోంది. ఈ క్రమంలో వినియోగదారుల కోసం తక్కువ ధరలకే రీఛార్జ్ ప్లాన్లను ప్రకటిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటివల ప్రవేశపెట్టిన బెస్ట్ ప్లాన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెలికాం రంగంలో ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో వినియోగదారుల కోసం తక్కువ ధరలకే కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతూ ఆకట్టుకుంటోంది. ఇటివల BSNL ప్రవేశపెట్టిన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ రూ. 1198కి అందుబాటులో ఉంది. ఇది వినియోగదారులకు అద్భుతమైన సేవలను అందిస్తోంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
365 రోజుల ప్లాన్
BSNL రూ. 1198 రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అంటే నెల చొప్పున చూస్తే కేవలం రూ. 99.83 మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతి నెలకు అన్ని నెట్‌వర్క్‌లకు 300 నిమిషాల కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. ఇది దేశవ్యాప్తంగా రోమింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. దీంతోపాటు ప్రతి నెలా 3GB డేటా కూడా అందించబడుతుంది. అంటే మొత్తం ఏడాది పొడవునా 36GB డేటాను వినియోగించుకోవచ్చు. ఇది పరిమిత డేటా వినియోగంపై ఆధారపడిన వారికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
SMSలు కూడా..
దీంతోపాటు ఈ రీఛార్జ్ ప్లాన్‌లో ప్రతి నెలా 30 ఉచిత SMSలను కూడా పొందుతారు. అంటే మొత్తం 360 SMSలను వినియోగదారులు పొందవచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు లేదా SMS సేవలను ఉపయోగించుకునే వారికి సౌకర్యంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండి, తక్కువ డేటాను వినియోగించే వారికి ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్లాన్ అనేక మందికి ఉపయోగకరంగా మారనుంది. ఈ క్రమంలో ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే BSNL ప్లాన్‌లు తక్కువ ధరకు ఉండటంతో అనేక మంది వీటివైపే మక్కువ చూపిస్తున్నారు.
BSNL ఇతర ప్లాన్‌లు
BSNL తన వినియోగదారుల కోసం రూ. 411, రూ. 1515 ధరలతో రెండు కొత్త బడ్జెట్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. రూ. 411 ప్లాన్ 90 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. దీనిలో అపరిమిత కాలింగ్ సౌకర్యంతోపాటు ప్రతి రోజు 2 జీబీ డేటా లభిస్తుంది. ఇక రూ. 1515 ప్లాన్ 365 రోజుల పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 2GB హై స్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ కొత్త ఆఫర్లు కూడా ప్రైవేట్ టెలికాం సంస్థలకు సవాలుగా మారుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విరాట్ కోహ్లీ ముందు 5 రికార్డులు.. బ్రేక్ చేస్తాడా..
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News