RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
ABN, Publish Date - Jan 28 , 2025 | 09:16 AM
దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డుల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక విషయాన్ని ప్రకటించింది. గత ఐదు సంవత్సరాలలో క్రెడిట్ కార్డుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
పొదుపు చేసే ధోరణి ఎక్కువగా ఉండే భారతదేశంలో ట్రెండ్ క్రమంగా మారుతోంది. ఎందుకంటే క్రెడిట్, డెబిట్ కార్డులను పెద్ద ఎత్తున వాడేస్తున్నారు. వీటి వాడకం గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ నివేదికను ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం. దేశంలో క్రెడిట్ కార్డుల సంఖ్య ఐదు సంవత్సరాలలో రెట్టింపు కంటే ఎక్కువగా 10.80 కోట్లకు చేరుకుంది. 2019 డిసెంబరుతో పోలిస్తే, 2024 డిసెంబర్ చివరి నాటికి క్రెడిట్ కార్డుల సంఖ్య భారీగా పెరిగింది. అదే సమయంలో డెబిట్ కార్డుల సంఖ్య మాత్రం స్వల్పంగా పెరిగిందని నివేదిక తెలిపింది. 2019 డిసెంబర్‌లో 805.3 మిలియన్ల డెబిట్ కార్డులు ఉన్నప్పటికీ, 2024 డిసెంబర్ నాటికి ఇది 990.9 మిలియన్లకు చేరుకుంది.
పుంజుకున్న లావాదేవీలు
ఈ క్రమంలో భారతదేశంలో డిజిటల్ లావాదేవీల వృద్ధి కూడా పుంజుకుందని చెప్పవచ్చు. 2013లో రూ. 772 లక్షల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు జరిగాయి. కానీ 2024లో ఈ సంఖ్య 94 రెట్లు పెరిగి రూ.2,758 లక్షల కోట్లుకు చేరుకుంది. లావాదేవీల పరిమాణం కూడా 3.5 రెట్లు పెరిగింది. 2024లో డిజిటల్ చెల్లింపుల పరిమాణంలో 6.7 రెట్లు, విలువలో 1.6 రెట్లు పెరుగుదల సాధించింది. మొత్తం డిజిటల్ చెల్లింపుల పరిమాణం 45.9 శాతం కాగా, విలువ 10.2 శాతంతో ఐదు సంవత్సరాల వృద్ధి రేటు (CAGR)ను నమోదు చేసింది.
ఇతర దేశాలకు
భారతదేశం మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా భారతీయ డిజిటల్ చెల్లింపుల వేగం పెరుగుతోంది. UPI ద్వారా భారత్ నుంచి సరిహద్దు దాటిన చెల్లింపులు కూడా వీటిలో ఉన్నాయి. ఈ ప్రాసెస్ ద్వారా, ఇతర దేశాలలో (భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, యుఏఈ) భారతీయ యూపీఐ యాప్‌ల ద్వారా వ్యాపారులకు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ క్రాస్-బోర్డర్ చెల్లింపుల సదుపాయాన్ని పెంచేందుకు RBI నిరంతరం పనిచేస్తోంది.
ఒప్పందాలు..
భారతదేశం, సింగపూర్ మధ్య ఫిబ్రవరి 2023లో ఓ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం చెల్లింపు వ్యవస్థలతో భారతదేశం (UPI) సింగపూర్ (PayNow) ద్వారా సరిహద్దు దాటిన చెల్లింపుల విస్తరణకు మొదటిసారి అడుగులు వేశారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాలకు కూడా ప్రస్తుతం వేగవంతమైన చెల్లింపు వ్యవస్థలను అనుసంధానం చేయడానికి RBI పనిచేస్తోంది. సరిహద్దు దాటిన చెల్లింపుల సమస్యలపై కూడా పని చేయడం ప్రారంభించింది. తక్కువ వేగం, పరిమిత ప్రాప్యత, పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలను నివారించడంలో ఈ చెల్లింపు వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి.
రిటైల్ చెల్లింపులు
RBI తన నివేదికలో భారతదేశంలోని చెల్లింపు వ్యవస్థలను ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటిగా అభివర్ణించింది. చెల్లింపుల రంగంలో ఆవిష్కరణలు, నియంత్రణ మద్దతుతో భారతదేశం ఈ రంగంలో గొప్ప ప్రగతిని సాధించింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ డిజిటల్ చెల్లింపులు రూ. 162 కోట్ల లావాదేవీలతో ప్రారంభమయ్యాయి. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 16,416 కోట్ల లావాదేవీలను చేరుకోవటానికి అవకాశం ఉంది. 12 సంవత్సరాలలో ఈ వృద్ధి దాదాపు 100 రెట్లు పెరిగిందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Jan 28 , 2025 | 09:17 AM