మొబిక్విక్, క్రెడ్ నుంచి డిజిటల్ రూపీ వ్యాలెట్లు
ABN , Publish Date - Jan 29 , 2025 | 02:04 AM
ఫిన్‌టెక్ కంపెనీలైన మొబిక్విక్, క్రెడ్ తాజాగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) లేదా డిజిటల్ రూపీ వ్యాలెట్లను అందుబాటులోకి తెచ్చాయి. ఆర్‌బీఐ, యెస్ బ్యాంక్ భాగస్వామ్యంతో...

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీలైన మొబిక్విక్, క్రెడ్ తాజాగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) లేదా డిజిటల్ రూపీ వ్యాలెట్లను అందుబాటులోకి తెచ్చాయి. ఆర్‌బీఐ, యెస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఈ సేవలను ప్రారంభించాయి. ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీని యూజర్లకు ఆఫర్ చేస్తున్న తొలి బ్యాంకింగేతర సంస్థలివే. ఆర్‌బీఐ తొలుత బ్యాంక్‌లను మాత్రమే డిజిటల్ రూపీ సేవలందించేందుకు అనుమతించింది. అయితే, సీబీడీసీ సేవలను విస్తరించేందుకు నాన్-బ్యాంకింగ్ కంపెనీలకూ ఇందుకు అనుమతివ్వాలని గత ఏడాది ఏప్రిల్‌లో ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. మొబిక్విక్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం పూర్తిస్థాయి ఈ-రూపీ వ్యాలెట్ సేవలను ప్రారంభించగా.. క్రెడ్ మాత్రం ఎంపిక చేసిన సభ్యుల కోసం బీటా వెర్షన్ వ్యాలెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ వ్యాలెట్ ద్వారా యూజర్లు ఇతరుల డిజిటల్ రూపీ వ్యాలెట్లతో పాటు యూపీఐ ద్వారా బ్యాంక్ అకౌంట్లకు నిధులు పంపవచ్చు లేదా అందుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Read More Business News and Latest Telugu News