Business Idea: తక్కువ పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం.. డిమాండ్ తగ్గని బిజినెస్..
ABN , Publish Date - Mar 01 , 2025 | 05:16 PM
Business Idea: చిన్న మొత్తంతో బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన మీకుందా..?నష్టపోకుండా ఎల్లప్పుడూ నిలకడగా ఆదాయం సంపాదించాలనే లక్ష్యం మీలో ఉంటే.. ఈ బిజినెస్ ప్లాన్ మీకోసమే. ఈ వ్యాపారం ద్వారా మీరే కాదు. మీతో నలుగురి ఉపాధి కూడా అందించే స్థాయికి తప్పక ఎదుగుతారు. ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఈ బిజినెస్ ఎలా మొదలుపెట్టాలి.. పెట్టుబడి, లాభాలపై పూర్తి వివరాలు..

Business Idea: వ్యాపారవేత్తగా రాణించాలని చాలామందికి డ్రీమ్. ఒకరికింద పనిచేయాల్సిన అవసరం లేకపోవడం ఒక కారణమైతే.. ఒక్కసారి నిలదొక్కుకుంటే ఉద్యోగంలో కంటే ఎక్కువగా సంపాదించవచ్చనే అభిప్రాయం ఉండటం. బిజినెస్ మ్యాన్ అనిపించుకోవాలనే ఆశ ఉండి.. సరైన ఆలోచన, సమాచారం కోసం వెతుకుతూ ఉంటే ఈ వ్యాపార ఆలోచన మీకోసమే. లోన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా తక్కువ ఇన్వెస్ట్ చేసి ఈ వ్యాపారంలో సులభంగా ఎవరైనా రాణిస్తారు. మార్కెటింగ్ చేసుకోవడం చాలా సులభం. డిమాండ్ కూడా ఎప్పటికీ తగ్గదు కాబట్టి భారీ లాభాలు పొందగలరు. మరి, ఆ బిజినెస్ ప్లాన్ ఏంటో తెలుసుకుందామా..
పల్లె, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ఎప్పుడూ నిర్మాణరంగ పనులు జరుగుతూనే ఉంటాయని అందరికీ తెలుసు. గతంలోలాగా కాకుండా ఇప్పుడంతా ఏ బిల్డింగ్ నిర్మించినా ఫ్లోరింగ్, గోడలు, ఇతరత్రా అవసరాల కోసం టైల్స్ తప్పక వినియోగిస్తున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం వల్ల టైల్స్ తయారీ వ్యాపారులకు చేతి నిండా పని, లాభాలు దొరుకుతున్నాయి. తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి త్వరగా పెద్ద స్థాయికి వ్యాపారాన్ని విస్తరించగలిగే వెసులుబాటు లభిస్తోంది. మరి, టైల్స్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి.. పెట్టుబడి ఎంత.. ఉత్పత్తికి అవసరమయ్యే ఖర్చులు, లాభాలు..తదితర వివరాలు..
కనీస పెట్టుబడి: టైల్స్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన కనీస పెట్టుబడి ఉత్పత్తి స్థాయి, తయారు చేసే టైల్స్ రకాన్ని బట్టి మారవచ్చు. అయితే, ఇక్కడ కొన్ని అంచనా వ్యయాలు ఉన్నాయి:
చిన్న తరహా ఉత్పత్తి (మాన్యువల్ ప్రక్రియ): రూ.50,000 - రూ.200,000.
మధ్య తరహా ఉత్పత్తి (సెమీ ఆటోమేటిక్ ప్రక్రియ): రూ.500,000 - రూ.2,000,000.
పెద్ద ఎత్తున ఉత్పత్తి (పూర్తిగా ఆటోమేటిక్ ప్రక్రియ): రూ.5,000,000 - రూ.20,000,000
టైల్స్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు:
బంకమట్టి లేదా సిరామిక్ పొడి
సిలికా ఇసుక
ఫెల్డ్‌స్పార్
క్వార్ట్జ్
రంగులు, గ్లేజ్‌లు
తయారీ విధానం:
ముడి పదార్థాలను కలపి మిశ్రమాన్ని తయారుచేయాలి.
పలకలను ఆకృతి చేయడం లేదా అచ్చు వేయడం చేయాలి.
పలకలను ఎండబెట్టి తర్వాత కాల్చాలి.
టైల్స్ గ్లేజింగ్, పాలిషింగ్ చేయాలి.
లాభాలు: టైల్స్ తయారీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉత్పత్తి స్థాయి, మార్కెట్ డిమాండ్, పోటీని బట్టి లాభాల మార్జిన్ ఇలా ఉంటుంది.
చిన్న తరహా ఉత్పత్తి: 10% - 20% లాభ మార్జిన్
మధ్య తరహా ఉత్పత్తి: 15% - 30% లాభ మార్జిన్
పెద్ద ఎత్తున ఉత్పత్తి: 20% - 40% లాభ మార్జిన్
కనీసం 250 నుంచి 300 గజాల స్థలం ఉంటే చిన్న స్థాయిలో రూ.50వేల పెట్టుబడితో టైల్స్ వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు. ముడిపదార్థాల హెచ్చుతగ్గులు, విద్యుత్ ఖర్చులు, కార్మిక ఖర్చులు, మార్కెట్లో పోటీ తదితర అంశాలు ఖర్చులను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఈ వ్యాపారంలో మార్కెటింగ్ వ్యూహాలు తప్పక అనుసరించాలి. ఆన్‌లైన్ మార్కెటింగ్, ప్రకటనలు, డీలర్, పంపిణీదారులతో నెట్‌వర్క్‌లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లకు ప్రత్యక్ష అమ్మకాలు చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంటే స్థిరమైన లాభాలు అందుకుంటారు.
Read Also : బిగ్ బాస్కెట్ బిగ్ టార్గెట్.. త్వరలో ఐపీఓకు, ఫుడ్ డెలివరీ విభాగంలోకి ఎంట్రీ..
March 2025 Bank Holidays Telugu: మార్చిలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. RBI లిస్ట్ ప్రకారం..
UPI 3.0: యూపీఐ 3.0 కొత్త ఫీచర్లు ఇవేనా