Share News

UPI 3.0: యూపీఐ 3.0 కొత్త ఫీచర్లు ఇవేనా

ABN , Publish Date - Mar 01 , 2025 | 05:08 PM

భారత్‌లో యూపీఐ సేవలు అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో యూపీఐ 3.0పై అప్పుడే చర్చ మొదలైంది. ఆర్థిక లావాదేవీలు మరింత సరళతరం చేసేలా పలు ఫీచర్లు ఇందులో ఉండొచ్చనేది ట్రేడ్ వర్గాల టాక్

UPI 3.0: యూపీఐ 3.0 కొత్త ఫీచర్లు ఇవేనా

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో యూపీఐ ఓ విప్లవం అని చెప్పక తప్పదు. చిల్లర కోసం అవస్థపడే రోజుల నుంచి రూ.1 కూడా మొబైల్ ద్వారా చెల్లించే అవకాశం భారతీయులకు దక్కింది. దీంతో, ప్రస్తుతం ఎక్కడ చూసినా యూపీఐ చెల్లింపులు సర్వసాధారణం అయిపోయాయి. యూపీఐ, యూపీఐ 2.0తో చూసిన భారతీయులకు యూపీఐ 3.0 అందించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే యూపీఐ 2.0తో డిజిటల్ చెల్లింపులు సులభతంగా మారిన విషయం తెలిసిందే. ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్లు, ఇన్‌వాయిస్ వెరిఫికేషన్లు, ఆటోపే వంటి ఎన్నో ఆధునాతన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకు మించిన అద్భుత సౌకర్యాలు యూపీఐ 3.0తో అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు (UPI 3.0 features).


Commerical Gas Cylinder Price Hike: మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు.. ఏ మేరకు పెరిగిందంటే..

యూపీఐ 3.0 ఫీచర్స్..

దేశంలో యూపీఐ చెల్లింపులు మరింతగా విస్తరించడానికి ప్రధాన అడ్డంకి.. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడమే. అయితే, యూపీఐ 3.0తో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ) లేదా బ్లూటూత్ ఆధారిత చెల్లింపులు అందుబాటులోకి వస్తాయట. ఈ సౌకర్యంతో ఇంటర్నెట్ సదుపాయం లేని గ్రామీణ ప్రాంతాల్లో కూడా సులువుగా చెల్లింపులు చేయొచ్చని చెబుతున్నారు.

ఇతర దేశాల్లో కూడా యూపీఐని విస్తరించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఇప్పటికే యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. అయితే, యూపీఐ 3.0తో అంతర్జాతీయంగా నగదు బదిలీ, వ్యాపార చెల్లింపులు కూడా సాధ్యమవుతాయట. కరెన్సీ మార్పిడి తలనొప్పులు లేకుండానే ఈ చెల్లింపులు పూర్తి చేసుకునే ఛాన్స్ ఉంటుందట.

క్రెడిట్ కార్డులు, ప్రీ అప్రూవ్డ్ లోన్స్‌ను యూపీఐతో అనుసంధానం చేయడంపై ఇప్పటికే ఆర్‌బీఐ కొన్ని సంకేతాలు ఇచ్చింది. ఇది అందుబాటులోకి వస్తే సంప్రదాయిక బ్యాంకింగ్ సేవలతో సంబంధం లేకుండానే రుణ లభ్యత పెరుగుతుందని తెలుస్తోంది. యూపీఐ ద్వారా నేరుగా స్వల్ప మొత్తాల్లో రుణాలు తీసుకునే అవకాశం లభిస్తుందని సమాచారం.


Gold Rates Today: త్వరపడండి.. తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి టైం

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో యూపీఐ 3.0లో ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయొచ్చని తెలుస్తోంది. బయోమెట్రిక్ వెరిఫికేషన్, అత్యాధునిక ఎన్‌క్రిప్షన్ వంటి వాటిని అమలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం యూపీఐ చెల్లింపులపై రోజుకు రూ.1 లక్ష పరిమితి ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిమితిని పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ చెల్లింపులకు ఈ పరిమితి పెంపు ఉండొచ్చని సమాచారం.

అయితే, యూపీఐ 3.0ని కేవలం చెల్లింపులకే పరిమితం చేయకుండా ఓ విస్తృత వ్యవస్థగా మలిచే యోచన కూడా ఉన్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ పురోగమించేందుకు యూపీఐ కీలకం కానుందని ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Read Latest and Business News

Updated Date - Mar 01 , 2025 | 05:33 PM