Share News

Budget-2025: కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

ABN , Publish Date - Feb 01 , 2025 | 01:58 PM

ఢిల్లీ: 2025-26 ఆర్థిక సంవత్సరంలో అప్పులు, ఇతర మార్గాల ద్వారా కేంద్ర ప్రభుత్వం 24 శాతం ఆదాయం సమకూర్చుకోనుంది. ఆదాయపు పన్ను ద్వారా 22 శాతం ఆదాయం కేంద్రానికి రానుంది. కేంద్ర ఎక్సైజ్‌ నుంచి 5 శాతం, జీఎస్టీ, ఇతర పన్నుల నుంచి 18 శాతం ఆదాయం రానుంది.

Budget-2025: కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..
Union Budget 2025

ఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్-2025 (Union Budget 2025)ను పార్లమెంట్‌ (Parliament)లో ప్రవేశపెట్టారు. రూ.50,65,345 కోట్లతో 2025-26 ఏడాది బడ్జెట్‌‌ను ఆమె సమర్పించారు. అలాగే ఏఏ రంగాలకు ఎంతెంత కేటాయించారో తెలిపారు. ఈ సందర్భంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రానికి వచ్చే ఆదాయం, ఖర్చు వివరాలను కేంద్రమంత్రి వివరించారు. వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, దాన్ని ఏ విధంగా ఎంత శాతం మేర ఖర్చు చేయనున్నారో నిర్మలా సీతారామన్ తెలిపారు.


2025-26 ఆదాయం వివరాలు...

2025-26 ఆర్థిక సంవత్సరంలో అప్పులు, ఇతర మార్గాల ద్వారా కేంద్ర ప్రభుత్వం 24 శాతం ఆదాయం సమకూర్చుకోనుంది. ఆదాయపు పన్ను ద్వారా 22 శాతం ఆదాయం కేంద్రానికి రానుంది. కేంద్ర ఎక్సైజ్‌ నుంచి 5 శాతం, జీఎస్టీ, ఇతర పన్నుల నుంచి 18 శాతం ఆదాయం రానుంది. కార్పొరేషన్‌ పన్ను ద్వారా 17 శాతం, పన్నేతర ఆదాయం కింద 9 శాతం, కస్టమ్స్‌ ద్వారా 4 శాతం రానుంది. అప్పులు కాని క్యాపిటల్‌ రిసిప్ట్స్‌ ద్వారా 1 శాతం ఆదాయం కేంద్రానికి సమకూరనుంది.


2025-26 ఖర్చుల వివరాలు..

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ మార్గాల ద్వారా కేంద్రం ఆదాయం పొందనుంది. అయితే వాటి ఖర్చుల విషయమై కేంద్రమంత్రి కీలక ప్రకటన చేశారు. ఏఏ రంగాలకు ఎంతెంత ఖర్చు చేయనున్నారో స్పష్టంగా తెలియజేశారు. వివిధ మార్గాల ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకు పన్నులు, డ్యూటీల ద్వారా 22 శాతం చెల్లింపులు చేయనున్నారు. అలాగే వడ్డీ చెల్లింపులకు 20 శాతం కట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16 శాతం ఆదాయాన్ని ఖర్చు చేయనున్నారు. రక్షణ రంగానికి 8 శాతం నగదు వాడుకోనున్నారు. ఫైనాన్స్‌ కమిషన్‌, ఇతర బదిలీల ద్వారా 8 శాతం ఖర్చు చేయనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, ఇతర ఖర్చులకు సైతం 8 శాతం చొప్పున ఆదాయం ఖర్చు చేయనున్నారు. కీలక సబ్సిడీలకు 6 శాతం, పెన్షన్స్‌లకు 4 శాతం ఆదాయాన్ని వాడనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.


2025-26 బడ్జెట్ కేటాయింపులు ఇవే..

  • రక్షణ రూ.4,91,732 కోట్లు

  • గ్రామీణాభివృద్ధి రూ.2,66,817 కోట్లు

  • హోం రూ.2,33,211 కోట్లు

  • వ్యవసాయ, అనుబంధ రంగాలు రూ.1,71,437 కోట్లు

  • విద్య రూ.1,28,650 కోట్లు

  • ఆరోగ్యం రూ.98,311 కోట్లు

  • పట్టణాభివృద్ధి రూ. 96,777 కోట్లు

  • ఐటీ, టెలికాం రూ.95,298 కోట్లు

  • విద్యుత్‌ రూ.81,174 కోట్లు

  • వాణిజ్య, పరిశ్రమలు రూ.65,553 కోట్లు

  • సామాజిక సంక్షేమం రూ. 60,052 కోట్లు

  • వైజ్ఞానికి విభాగాలకు రూ. 55,679 కోట్లు


ఈ వార్తలు కూడా చదవండి:

Budget 2025: టీడీఎస్.. వృద్ధులకు తగ్గింపు.. అద్దెలపై వచ్చే ఆదాయంపై పెంపు..

Budget 2025: పేదోడు విమానం ఎక్కేలా.. చవకగా ఫ్లైట్ టికెట్లు.. కేంద్రం అదిరిపోయే నిర్ణయం

Updated Date - Feb 01 , 2025 | 02:11 PM

News Hub