ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Future Jobs: 2030 నాటికి 17 కోట్ల కొత్త జాబ్స్.. ఫ్యూచర్ జాబ్స్ నివేదికలో..

ABN, Publish Date - Jan 08 , 2025 | 09:50 PM

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) కూడా ఫ్యూచర్ జాబ్స్ రిపోర్ట్-2025 నివేదికను అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో 2030 నాటికి 17 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. దీంతోపాటు కీలక విషయాలను ప్రకటించింది.

Future Jobs 2025 report wef

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) కూడా 'ఫ్యూచర్ జాబ్స్ రిపోర్ట్-2025'లో (Future Jobs 2025 Report ) కీలక విషయాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2030 నాటికి 17 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని తెలిపింది. దీంతోపాటు 9.2 కోట్ల ఉద్యోగాలు కోల్పోవాల్సి రావచ్చని వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో భారతీయ కంపెనీలు ప్రపంచాన్ని అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) తాజా ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ నివేదిక ప్రకారం భారతీయ కంపెనీలు ఏఐ, రోబోటిక్స్, ఎనర్జీ టెక్నాలజీల వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.


ఏ ఉద్యోగాలు హిట్

నివేదిక ప్రకారం 35% భారతీయ కంపెనీలు సెమీకండక్టర్లు, కంప్యూటింగ్ టెక్నాలజీ తమ వ్యాపారాన్ని పూర్తిగా మార్చగలవని విశ్వసిస్తున్నాయి. అయితే ఈ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 20% మాత్రమే. అదేవిధంగా 21% భారతీయ యజమానులు క్వాంటం, ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీని ముఖ్యమైనవిగా భావిస్తారు, ఇది ప్రపంచంలోని 12%గానే ఉంది. బిగ్ డేటా, AI, మెషీన్ లెర్నింగ్, సైబర్ నిర్వహణ వంటి ఉద్యోగాలు భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతాయని తెలిపింది. ఇవి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్‌లకు సరిపోతాయని చెప్పింది. టాలెంట్ కొరతను ఎదుర్కొనేందుకు భారతీయ కంపెనీలు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నాయని ప్రస్తావించింది.


భారతదేశంలో AI నైపుణ్యాలకు డిమాండ్

67% కంపెనీలు కొత్త, విభిన్న టాలెంట్ పూల్స్‌పై దృష్టి సారిస్తున్నాయి. 30% కంపెనీలు డిగ్రీ షరతును తొలగించి నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ గణాంకాలు వరుసగా 47%, 19%గా ఉన్నాయి. AI నైపుణ్యాల డిమాండ్‌లో భారతదేశం, అమెరికా అగ్రస్థానంలో ఉన్నాయి. కానీ వ్యత్యాసం ఏమిటంటే అమెరికాలో ప్రజలు దాని అధ్యయనంపై ఆసక్తి చూపుతున్నారు. అయితే భారతదేశంలో కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు AI నెర్పించడానికి పెట్టుబడి పెడుతున్నాయి.


2030 నాటికి భారతదేశంలో ఏమి మారుతుంది?

2030 నాటికి డిజిటల్ టెక్నాలజీల విస్తరణ, వాతావరణ చర్యలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతదేశంలో ఉద్యోగాలను పునర్నిర్మించగలవని నివేదిక సూచిస్తుంది. ఇది కాకుండా భారతదేశ యువత జనాభాకు ప్రధాన సహకారం ఉంటుంది. నివేదిక ప్రకారం రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ శ్రామిక శక్తిలో మూడింట రెండు వంతుల మంది భారతదేశం, ఆఫ్రికా వంటి ప్రాంతాల నుంచి ఉంటారు.


ప్రపంచంలో ఉద్యోగాల పరిస్థితి

నివేదిక ప్రకారం 2030 నాటికి 170 మిలియన్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఇదే సమయంలో 92 మిలియన్ల ఉద్యోగాలు కూడా కోల్పోతారు. అంటే 78 మిలియన్ల కొత్త ఉద్యోగాలు వచ్చే ఛాన్సుంది. కొత్త ఉద్యోగాలలో రైతులు, డెలివరీ డ్రైవర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు వంటి జాబ్స్ ఉంటాయి. అదే సమయంలో AI కారణంగా క్యాషియర్, అడ్మిన్ అసిస్టెంట్ వంటి జాబ్స్ తగ్గుతాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న 40% నైపుణ్యాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. 63% మంది యజమానులు తమ వ్యాపారాన్ని మార్చడానికి ఇదే అతిపెద్ద అడ్డంకిగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త టెక్నాలజీలు, నైపుణ్యాలను అలవర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వారికే భవిష్యత్‌లో ఉద్యోగాలు ఉంటాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ రేసులో భారత్ చేరడమే కాకుండా అనేక విధాలుగా ముందుందని తెలిపింది.


ఇవి కూడా చదవండి:

Budget 2025: బడ్జెట్‌ 2025లో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు కాబోతుందా..

SNACC: 15 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ.. మార్కెట్లోకి కొత్త యాప్..


Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ


Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..

Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..

Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..


Bima Sakhi Yojana: బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి.. నెలకు రూ.7 వేలు పొందండి..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 08 , 2025 | 09:51 PM