Share News

Gold Prices Hit Record High : బంగరంగరం!

ABN , Publish Date - Apr 02 , 2025 | 04:33 AM

పసిడి ధరలు మంగళవారం సరికొత్త జీవిత కాల రికార్డు గరిష్ఠానికి ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా రూ.2,000 పెరిగి రూ.94,150కి చేరింది. దేశీయంగా...

Gold Prices Hit Record High :  బంగరంగరం!

  • రూ.94,000 దాటిన 10 గ్రాముల పసిడి

  • ఒక్కరోజే రూ.2,000 పెరుగుదలతో సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయికి..

  • గత 2 నెలల్లో ఇదే అతిపెద్ద పెరుగుదల

న్యూఢిల్లీ: పసిడి ధరలు మంగళవారం సరికొత్త జీవిత కాల రికార్డు గరిష్ఠానికి ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా రూ.2,000 పెరిగి రూ.94,150కి చేరింది. దేశీయంగా మేలి మి బంగారం రూ.94,000కు చేరడం ఇదే ప్రప్రథమం. అంతేకాదు, ఈ విలువైన లోహం రేటు పెరగడం వరుసగా ఇది నాలుగో రోజు. అంతర్జాతీయంగా దీని ధరలు వేగంగా పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. 99.5 శాతం స్వచ్ఛత లోహం రేటు కూడా రూ.2000 పెరుగుదలతో ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.93,700కు ఎగబాకింది. దాదాపు 2 నెలల్లో గోల్డ్‌కు ఇదే అతిపెద్ద ఒక్కరోజు పెరుగుదల. ఈ ఫిబ్రవరి 10న తులం పసిడి రూ.2,400 పెరుగుదలను నమోదు చేసింది. ఈ జనవరి 1న రూ.79,390 పలికిన బంగారం.. గడిచిన మూడు నెలల్లో రూ.14,760 (18.6 శాతం) మేర పుంజుకుంది. వెండి విషయానికొస్తే, కిలో రూ.500 తగ్గుదలతో రూ.1,02,500కు పరిమితమైంది.


అంతర్జాతీయ మార్కెట్లోనూ కొత్త రికార్డు

ట్రంప్‌ సుంకాలు వాణిజ్య యుద్ధాలకు దారి తీయనున్నాయన్న భయాందోళనలతో ఇన్వెస్టర్లు ఈక్విటీల్లోని పెట్టుబడులను ఈ విలువైన లోహాల్లోకి మళ్లిస్తున్నారు. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డు స్థాయికి పెరిగాయి. స్పాట్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ 3,149.03 డాలర్లు, జూన్‌ డెలివరీ గడువుతో కూడిన కామెక్స్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు 3,177 డాలర్ల వద్ద ఆల్‌టైం గరిష్ఠాలను నమోదు చేశాయి. సిల్వర్‌ మాత్రం అర శాతానికి పైగా తగ్గి 33.83 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.


ఏడాది చివరినాటికి 4,000 డాలర్లకు!?

ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయాల్లో మన పెట్టుబడులకు భద్రత కలిగించే సాధనంగా బంగారానికి పేరుంది. ట్రంప్‌ సుంకాల ప్రకటనలు అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితిని పెంచడంతో ఈ ఏడాది గోల్డ్‌ రేటు భారీగా పెరిగింది. ఈ మార్చి 14న ఔన్స్‌ బంగారం తొలిసారిగా 3,000 డాలర్లకు చేరింది. ప్రస్తుతం 3,150 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. ఈనెల 2 నుంచి అమలులోకి రానున్న ట్రంప్‌ సుంకాలు వాణిజ్య అనిశ్చితులను తీవ్రతరం చేయనుంది. ఇందుకు తోడు, అమెరికా మళ్లీ ఆర్థిక మాంద్యంలోకి జారుకునే అవకాశాలూ రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో గోల్డ్‌ ర్యాలీ మున్ముందూ కొనసాగవచ్చని, ఈ ఏడాది చివరినాటికి ఔన్స్‌ 4,000 డాలర్లకు చేరుకునే అవకాశాలున్నాయని బులియన్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Donald Trump: భారత ఉత్పత్తులకు అమెరికాలో వాత..చుక్క, ముక్కపై ట్రంప్ ఫోకస్..

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..

Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 02 , 2025 | 04:33 AM