Share News

మార్చి జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు

ABN , Publish Date - Apr 02 , 2025 | 04:29 AM

ఈ ఏడాది మార్చి నెలలోనూ జీఎస్‌టీ వసూళ్లు పెరిగాయి. గత నెల మొత్తానికి ఈ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 9.9 శాతం ఎక్కువ. మార్చి నెల....

మార్చి జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు

  • గత నెలలో 9.9ు పెరిగిన వసూళ్లు

  • తెలంగాణలో రూ.5,401 కోట్లు

  • ఏపీలో రూ.4,033 కోట్లుగా నమోదు

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి నెలలోనూ జీఎస్‌టీ వసూళ్లు పెరిగాయి. గత నెల మొత్తానికి ఈ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 9.9 శాతం ఎక్కువ. మార్చి నెల మొత్తానికి సీజీఎ్‌సటీ రూపంలో రూ.38.100 కోట్లు, ఎస్‌జీఎ్‌సటీ రూపంలో రూ.49,900 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎ్‌సటీ రూపంలో రూ.95,900 కోట్లు, జీఎ్‌సటీ సెస్సు రూపంలో రూ.12,300 కోట్లు వసూలయ్యాయి. రిఫండ్స్‌ తీసివేస్తే గత నెల మొత్తానికి నికరంగా జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.76 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.3 శాతం ఎక్కువ.

2024-25లో రూ.22.08 లక్షల కోట్లు మార్చి ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూసినా జీఎ్‌సటీ వసూళ్లు రూ.22.08 లక్షల కోట్లకు చేరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 9.4 శాతం ఎక్కువ. రిఫండ్స్‌ని తీసివేసినా 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.19.56 లక్షల కోట్ల జీఎ్‌సటీ వసూలైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 8.6 శాతం ఎక్కువ.


తెలుగు రాష్ట్రాల్లో అంతంతే

గత నెల జీఎస్‌టీ వసూళ్లు దేశవ్యాప్తంగా 9.9 శాతం పెరిగినా, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా ఎదుగుబొదుగూ లేదు. రెండు రాష్ట్రాల నుంచి గత నెల రూ.9,434 కోట్ల జీఎస్‌టీ వసూలైంది. ఇందులో ఏపీ నుంచి రూ.4,033 కోట్లు, తెలంగాణ నుంచి రూ.5,401 కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది ఇదే కాలం తో పోలిస్తే ఏపీలో వసూళ్లు ఒక శాతం పడిపోగా తెలంగాణాలో జీరో శాతం వృద్ది రేటు నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) మొత్తానికి చూసినా ఏపీలో 1.2 శాతం పెరిగి రూ.44,825 కోట్లకు, తెలంగాణాలో 5.1 శాతం వృద్ధి రేటుతో రూ.62,987 కోట్లకు చేరాయి.

ఇవి కూడా చదవండి:

Donald Trump: భారత ఉత్పత్తులకు అమెరికాలో వాత..చుక్క, ముక్కపై ట్రంప్ ఫోకస్..

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 02 , 2025 | 04:29 AM