Budget-2025 : భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరలు
ABN , Publish Date - Feb 01 , 2025 | 01:49 PM
2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో అనేక రంగాల్లో సరికొత్త సంస్కరణలను తీసుకొచ్చారు. అలాగే విద్య, వ్యవసాయం, టెక్నాలజీ రంగాలకు అనేక ప్రోత్సాహకాలను అందించారు. ఈ బడ్జెట్‌తో కొత్తగా ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సీసం, జింక్ సహా మొత్తం 12 ఖనిజాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ప్రాణాలను కాపాడే 36 మందులకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు.
అదేవిధంగా కేన్సర్ చికిత్సకు సంబంధించిన మూడు మందులకు కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు.
నౌకల తయారీకి అవసరమైన ముడి సరుకులపై కూడా కస్టమ్స్ డ్యూటీని పదేళ్ల పాటు మినహాయింపు ఇచ్చారు.
సముద్ర ఉత్పత్తులపై బేసిక్ కస్టమ్ డ్యూటీని 35 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
తోలు, తోలు ఉత్పత్తులు భారీగా తగ్గుతాయి.
ఎల్ఈడీ, ఎల్ సీడీ టీవీల ధరలు కూడా తగ్గనున్నాయి.
ఫోన్లు, లిథియం బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా తగ్గుతాయి.
ఫ్రోజెన్ చేపలు, చేపల పేస్ట్‌కు సంబంధించిన ధరలు.
భారత్‌లో తయారయ్యే దుస్తులు ధరలను కూడా తగ్గించనున్నారు.
క్యారియర్- గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లతో పాటూ 12 రకాల కీలకమైన ఖనిజాల ధరలు కూడా తగ్గుతాయి.