Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ
ABN, Publish Date - Jan 06 , 2025 | 08:44 PM
మీరు కోటి రూపాయలను సంపాదించాలని అనుకుంటున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఒకేసారి కొంత మొత్తాన్ని పెట్టుబడి చేసి మీరు కోటీశ్వరులు కావచ్చు. అయితే దీనికోసం ఎంత పెట్టుబడి చేయాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుత సమాజంలో అనేక మంది కోటీశ్వరులు కావాలని భావిస్తున్నారు. అందుకోసం పలువురు అనేక రకాల పథకాలలో పెట్టుబడులు (Investment Tips) చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి చేసి తక్కువ సమయంలోనే కోటీశ్వరులు కావాలని చూస్తున్నారా. అయితే దాని కోసం ఎంత ఇన్వెస్ట్ చేయాలి. ఎన్నేళ్లు పాటు వేచి చూడాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రజాదరణ పొందుతున్న మ్యాచువల్ ఫండ్ SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) విధానాన్ని ఎంచుకుంటే దీని ద్వారా మీరు సులభంగా అనుకున్న మొత్తాన్ని అందుకోవచ్చు.
ఒకేసారి పెట్టుబడితో..
ఈ నేపథ్యంలో మీరు సిప్ విధానంలో ఒకేసారి 13 లక్షల రూపాయలను పెట్టుబడి చేసి మర్చిపోండి. ఆ తర్వాత మీరు 15 సంవత్సరాల తరువాత కోటి రూపాయలను అందుకుంటారు. వార్షిక రాబడి 15 శాతం వడ్డీ ప్రకారం మీకు రూ. 1,05,78,180 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో మీరు 13 లక్షలు పెట్టుబడి చేయగా, మీకు వడ్డీ రూపంలోనే రూ. 92,78,180 లక్షలు లభిస్తాయి. రిటైర్ అయిన ఎవరైనా వారి పిల్లలకు ఇచ్చిన మొత్తాన్ని ఇలా ఉపయోగించుకుంటే మంచి రాబడులు వస్తాయని చెప్పవచ్చు. లేదా ఇంకేదైనా ఆస్తి అమ్మకం లేదా ఇతర వ్యాపారాల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఈ విధానంలో సేవ్ చేస్తే మీకు భారీ మొత్తం లభించే ఛాన్స్ ఉంది.
తక్కువ పెట్టుబడితో కూడా..
అయితే మీకు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి చేసే పరిస్థితి లేకున్నా కూడా ఇబ్బంది లేదు. ప్రతి నెలలో కూడా కొంత మొత్తాన్ని పెట్టుబడి చేయడం ద్వారా కూడా ఈ మొత్తాన్ని పొందవచ్చు. కానీ దీని కోసం ప్రతి నెలలో కూడా తప్పనిసరిగా చెల్లింపులు చేసుకోవాలి. ఈ కోటీ రూపాయల మొత్తం కావాలంటే మీరు ప్రతి నెలలో రూ. 5 వేలు పెట్టుబడి చేయాలి. ఈ విధంగా 22 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది.
15 శాతం వార్షిక రాబడి ప్రకారం చూస్తే మీకు 22 ఏళ్ల తర్వాత రూ. 1,03,53,295 లభిస్తాయి. ఈ నేపథ్యంలో మీరు పెట్టుబడి చేసే మొత్తం రూ. 13,20,000 కాగా, మీకు వడ్డీ రూపంలోనే రూ. 90,33,295 లక్షలు వస్తాయి. ఈ లక్ష్యాలను మీరు చేరుకోవాలంటే తక్కువ మొత్తంలో పెట్టుబడి చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే తక్కువ టైం అవసరం అవుతుంది.
గమనిక: ఆంధ్రజ్యోతి పెట్టుబడి చేయాలని సలహా ఇవ్వదు, సమాచారం మాత్రమే ఇస్తుంది. మీకు ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం ఉత్తమం.
ఇవి కూడా చదవండి:
Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..
Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..
Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..
Bima Sakhi Yojana: బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి.. నెలకు రూ.7 వేలు పొందండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News
Updated Date - Jan 06 , 2025 | 08:48 PM