Share News

Jeevan Shiromani: అద్భుతమైన ప్లాన్.. 4 ఏళ్లు డబ్బులు కడితే.. రూ. కోటి మీదే..

ABN , Publish Date - Apr 15 , 2025 | 10:45 AM

Jeevan Shiromani: ఈ ప్లాన్‌లో చేరి నాలుగు సంవత్సరాల పాటు ప్రీమియం కడితే.. కోటి రూపాయలు లేదా అంతకు మించి రాబడి పొందే అవకాశం ఉంది. ఈ ప్లాన్ కేవలం ఇన్సురెన్స్‌గా మాాత్రమే కాదు.. ఇన్వెస్టిమెంట్‌గా కూడా పని చేస్తుంది. మంచి లాభాలను ఇస్తుంది.

Jeevan Shiromani: అద్భుతమైన ప్లాన్.. 4 ఏళ్లు డబ్బులు కడితే.. రూ. కోటి మీదే..
LIC Jeevan Shiromani Plan

కస్టమర్లను ఆకర్షించడానికి లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్(ఎల్ఐసీ) కొత్త కొత్త ప్లాన్లు అందుబాటులోకి తెస్తోంది. తాజాగా, నెలకు లక్షలు సంపాదించే వారికోసం ‘జీవన్ శిరోమణి’ పేరిట ఓ అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో చేరే వారు రెండు రకాల లబ్ధి పొందొచ్చు. ప్లాన్‌లో పెట్టే మొత్తం ప్రీమియం ఇన్సురెన్స్‌గా.. ఇన్వెస్టిమెంట్‌గా కూడా మారుతుంది. నాలుగేళ్ల పాటు మీరు ప్రీమియం కడితే తక్కువలో తక్కువ కోటి రూపాయల లాభం పొందొచ్చు. తాము పెట్టే పెట్టుబడి సేఫ్‌గా ఉండటంతో పాటు అధిక మొత్తం రాబడి కోరుకునే వారు ఈ ప్లాన్‌లో చేరవచ్చు. ఈ ప్లాన్‌లో చేరి నెలకు 94,000 రూపాయల చొప్పున 4 ఏళ్ల పాటు ప్రీమియం కడితే.. మినిమం కోటి రూపాయలు వస్తుంది.


పాలసీ వివరాలు

నెలకు 94 వేల రూపాయల చొప్పున 4 సంవత్సరాలు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. తీసుకున్న పాలసీ గడువును బట్టి కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలను రాబడిగా పొందొచ్చు. 18 సంవత్సరాలు ఉన్న వారు ఈ పాలసీలో చేరవచ్చు. ఇందులో మొత్తం నాలుగు రకాల టర్మ్ పాలసీలు ఉన్నాయి. 14,16,18,20 సంవత్సరాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. 14 ఏళ్ల పాలసీ తీసుకునే వాళ్ల వయసు 55 సంవత్సరాల వరకు ఉండొచ్చు. 16 ఏళ్ల పాలసీ తీసుకునే వారి వయసు 51 సంవత్సరాల వరకు ఉండొచ్చు. 18 ఏళ్ల పాలసీ తీసుకునే వారి వయసు 48 సంవత్సరాల వరకు ఉండొచ్చు. 20 ఏళ్ల పాలసీ తీసుకునే వారి వయసు 45 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ప్రీమియంను నాలుగు పద్దతుల్లో చెల్లించవచ్చు. నెల, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం..మన వెసలుబాటును బట్టి కట్టుకోవచ్చు.


మనీ బ్యాక్ ప్లాన్..

ఈ పాలసీ మనీ బ్యాక్ ప్లాన్‌లాగా ఉపయోగపడుతుంది. ప్లాన్ మెచ్యూరిటీ కంటే ముందే కొంత మొత్తాన్ని మనీ బ్యాక్ పొందొచ్చు. మిగిలిన మొత్తం మెచ్యూరిటీ తర్వాత వస్తుంది. బోనస్‌తో కలిపి మిగిలిన మొత్తాన్ని ఇస్తారు.

  • 14 ఏళ్ల పాలసీ తీసుకున్నట్లయితే.. 10,12 సంవత్సరాల్లో 30 శాతం డబ్బులు వస్తాయి.

  • 16 ఏళ్ల పాలసీ తీసుకున్నట్లయితే.. 12,14 సంవత్సరాల్లో 35 శాతం డబ్బులు వస్తాయి.

  • 18 ఏళ్ల పాలసీ తీసుకున్నట్లయితే.. 14, 16 సంవత్సరాల్లో 40 శాతం డబ్బులు వస్తాయి.

  • 20 ఏళ్ల పాలసీ తీసుకున్నట్లయితే.. 16, 18 సంవత్సరాల్లో 45 శాతం డబ్బులు వస్తాయి.


అనారోగ్యం, మరణం సమయంలో..

జీవన్ శిరోమణి పాలసీ క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజ్‌గా కూడా ఉపయోగపడుతుంది. పాలసీలో పొందుపరిచిన రోగాలు వచ్చినట్లయితే 10 శాతం డబ్బులు వెంటనే వస్తాయి. ఒక వేళ పాలసీదారుడు అనుకోని విధంగా చనిపోతే బోనస్‌తో కలిపి కొంత మొత్తం నామినీకి వస్తుంది.


ఇవి కూడా చదవండి

Health Tips: నిమ్మరసం మీ కళ్ళలోకి పడితే ఏమి జరుగుతుందో మీకు తెలుసా..

R. Krishnaiah: ఆర్‌.కృష్ణయ్య హెచ్చరిక.. ప్రజాభవన్‌ను హాస్టళ్లుగా మారుస్తాం

Updated Date - Apr 15 , 2025 | 10:45 AM