టిక్‌టాక్ కొనుగోలు రేసులో మైక్రోసాఫ్ట్ !
ABN , Publish Date - Jan 29 , 2025 | 02:10 AM
ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక మాధ్యమాల్లో ఒకటైన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోంది....

ధ్రువీకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
న్యూయార్క్: ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక మాధ్యమాల్లో ఒకటైన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోంది. అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. టిక్ టాక్ అమెరికా కార్యకలాపాలను చేజిక్కించుకునేందుకు మైక్రోసాఫ్ట్ సహా పలు టెక్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయన్నారు. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్, ఒరాకిల్ చైర్మన్ ల్యారీ ఎల్లిసన్ కూడా ఈ ప్లాట్‌ఫామ్ కొనుగోలుకు పోటీపడాలని ఆయన కోరారు. టిక్‌టాక్‌లో 50 శాతం వాటా అమెరికన్ కంపెనీ చేతుల్లో ఉండాలని తాను కోరుకుంటున్నాని ఆయన పేర్కొన్నారు. జాతీయ భద్రత కారణాల దృష్ట్యా టిక్‌టాక్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ హయాంలో విధించిన నిషేధం అమలును ట్రంప్ 75 రోజుల పాటు వాయిదా వేశారు.
అప్పటిలోగా టిక్‌టాక్ యూఎస్ కార్యకలాపాలను విక్రయించాలని, లేదంటే నిషేధానికి గురికాక తప్పదని చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్‌కు అల్టిమేటం జారీ చేశారు. టిక్‌టాక్ మాతృసంస్థే బైట్‌డ్యాన్స్. టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ 2020లోనే పోటీపడ్డాయి. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఈ దిశగా చర్చలు ప్రారంభమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Read More Business News and Latest Telugu News