Minimum Bank Balance: సామాన్యులకు షాకింగ్..ఏప్రిల్ 1 నుంచి మినిమం బ్యాలెన్స్ పేరుతో బ్యాంకుల బాదుడు..
ABN, Publish Date - Mar 31 , 2025 | 05:16 PM
దేశంలో మధ్య తరగతి ప్రజలకు కీలక అలర్ట్. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి మొదలు కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో అనేక రకాల రూల్స్ మారుతున్నాయి. వీటి గురించి తెలుసుకోకుంటే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. వీటిలో బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం సహా ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి.

ఏప్రిల్ 1, 2025 నుంచి మొదలు కానున్న కొత్త ఆర్థిక సంవత్సరం సామాన్యుల జేబులను గుల్ల చేసేలా ఉంది. ఎందుకంటే కొత్తగా అమలు కానున్న రూల్స్ విషయంలో మధ్య తరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. వీటిలో ప్రధానంగా పలు బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్, యూపీఐ రూల్స్ వంటివి ఇబ్బందులుగా మారాయని పలువురు అంటున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి SBI (State Bank of India), పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సహా మరికొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ నిబంధనలను అమలు చేస్తున్నాయి.
మినిమం బ్యాలెన్స్
బ్యాంకులు ఈ నియమాలను ఖాతా ప్రాంతాన్ని బట్టి కనీస బ్యాలెన్స్ అవసరాలను అమలు చేస్తున్నాయి. అంటే పట్టణ ఈ ప్రాంతాలలో అధిక కనీస బ్యాలెన్స్ అవసరం. సెమీ-అర్బన్ ఈ ప్రాంతాలలో మితమైన కనీస బ్యాలెన్స్ అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ కనీస బ్యాలెన్స్ ఉండాలనే నిబంధనలను అమలు చేస్తారు. అంతేకాదు, మీరు నిర్దేశించిన కనీస బ్యాలెన్స్ మీ ఖాతాలో ఉంచకపోతే, మీరు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి, ఖాతాదారులు తమ బ్యాలెన్స్‌ను సరిగ్గా నిర్వహించడానికి ఈ నిబంధనలను పరిగణనలో తీసుకుని మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి.
మొత్తం విషయాలను
బ్యాంకు ఖాతాను బట్టి ఈ మొత్తం మారుతుంది. అంటే కొన్ని బ్యాంకు ఖాతాదారులు పట్టణ ప్రాంతాల్లో రూ. 5,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2,000 కనీస బ్యాలెన్స్‌ను ఉంచుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు లావాదేవీల భద్రతను పెంచడానికి, బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ (PPS)ను విధానాన్ని కూడా అమలు చేస్తున్నాయి. ఈ పద్ధతి ద్వారా రూ. 5,000 కంటే ఎక్కువ విలువ ఉన్న చెక్కుల లావాదేవీలకు వర్తిస్తుంది. దీని ప్రకారం చెక్ నంబర్, తేదీ, చెక్ చెల్లింపుదారుని పేరు, చెక్ మొత్తం వంటి విషయాలను ప్రస్తావించాలి. చెక్కుల పేరుతో జరుగుతున్న మోసాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
UPI నియమాల్లో మార్పులు
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఏప్రిల్ 1, 2025 నుంచి చాలా కాలంగా పనిచేయకుండా ఉన్న మొబైల్ బ్యాంకుల UPI లావాదేవీలను నిలిపివేయబోతోంది. అంటే, మీ బ్యాంక్ ఖాతాకు పాత నంబర్ లింక్ చేయబడి, అది చాలా కాలం పాటు ఉపయోగించకుండా ఉంటే, ఆ UPI లావాదేవీలను కొనసాగించడానికి, మీరు ఏప్రిల్ 1, 2025 లోపు మీ బ్యాంక్ ఖాతాకు కొత్త నంబర్‌ను లింక్ చేయాలి. లేదంటే ఆ నంబర్‌తో UPI లావాదేవీలు చేయలేరు. మోసం, ఫిషింగ్ స్కామ్‌లను నివారించడానికి గత 12 నెలలుగా ఉపయోగించని UPI IDలను NPCI నిలిపివేస్తుంది. ఈ క్రమంలో పనిచేయకుండా ఉన్న UPI IDలను తిరిగి యాక్టివేట్ చేయని వినియోగదారులు వాటిని పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Read More Business News and Latest Telugu News
Updated Date - Mar 31 , 2025 | 05:22 PM