Share News

Multibagger Stock: అప్పుడు రూ.21 వేల పెట్టుబడి.. నేడు రూ. 16 లక్షలకు పైగా రాబడి..

ABN , Publish Date - Apr 15 , 2025 | 07:09 PM

స్టాక్ మార్కెట్ గురించి చాలామంది సరైన అవగాహన లేకుండా వీటిలో నష్టాలు ఉంటాయని భయాందోళన చెందుతారు. నిజానికి ఇది ఒక్కసారి అర్థమైతే, అదృష్టం కాదు, మీకు ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుంది. అచ్చం ఇక్కడ కూడా అలాగే జరిగింది. రూ.21 వేలను ఓ కంపెనీలో పెట్టిన ఓ వ్యక్తికి ప్రస్తుతం ఏకంగా రూ.16 లక్షలకుపైగా వచ్చాయి. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Multibagger Stock: అప్పుడు రూ.21 వేల పెట్టుబడి.. నేడు రూ. 16 లక్షలకు పైగా రాబడి..
multibagger stock

స్టాక్ మార్కెట్ అంటే ఎంతో మంది భయపడుతూ దూరంగా ఉంటారు. కానీ మీరు ఈ మార్కెట్‌పై అవగాహన పెంచుకుని, సరైన సమయంలో, సరైన స్టాక్స్‌ను ఎంచుకుంటే, కొన్ని నెలల్లోనే లక్షాధికారులు కావచ్చు. ఇటీవల అనేక మంది కూడా మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఎంచుకుని వారి జీవితాలను మార్చేసుకున్నారు. ఈ స్టాక్స్ ద్వారా చాలా తక్కువ సమయంలో భారీ లాభాలు సాధించవచ్చు. మల్టీ బ్యాగర్ అంటే పెట్టిన డబ్బుకు 2x, 3x, లేదా 5x లాభంతో తక్కువ మొత్తంలో లభించడమే. ఈ క్రమంలోనే తాజాగా మరో కంపెనీ స్టాక్స్ కూడా ఇప్పుడు ఇదే జాబితాలోకి చేరాయి.


రాబడి విశ్లేషణ

వెంకీస్ (ఇండియా) లిమిటెడ్, VH గ్రూప్‌లో భాగంగా, పౌల్ట్రీ పరిశ్రమలో తన వ్యాపారాన్ని విస్తరిస్తుంది. పౌల్ట్రీ బ్రీడింగ్, జంతు ఆరోగ్య ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన చికెన్ ఉత్పత్తులు వంటి విభాగాల్లో వ్యాపారం చేస్తుంది. భారతదేశంలో బలమైన ఉనికిని కలిగి ఉన్న ఈ సంస్థ కొన్ని ఉత్పత్తులను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది. జూలై 28, 2003న స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించిన వెంకీస్ (ఇండియా) లిమిటెడ్ షేరు ధర రూ.21గా ఉంది. కానీ ఇప్పటి ధర మాత్రం రూ.1,680గా కలదు. అంటే 22 ఏళ్లలో ఈ స్టాక్ ప్రైస్ ఏకంగా 12,951.78% పెరిగింది.


అంతర్జాతీయ మార్కెట్లలో కూడా..

అంటే 2003లో ఈ కంపెనీ షేర్లు వెయ్యి కొంటే రూ.21 చొప్పున రూ.21,000 పెట్టుబడి అవుతుంది. కానీ వాటిని అలాగే సేల్ చేయకుండా ఇప్పటివరకు ఉంచిన వారికి మంచి రాబడి వస్తుందని చెప్పవచ్చు. అంటే అప్పుడు రూ.21 వేలు పెట్టిన వారికి ప్రస్తుతం రూ.16 లక్షలకు పైగా (రూ.16,59,000) వస్తుంది. సాధారణంగా వెంకీస్ చికెన్ ఉత్పత్తులు దేశంలోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాయి. దీంతో ఈ కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పెరిగింది.

గమనిక: ఆంధ్రజ్యోతి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేయాలని సలహా, సూచనలు చేయదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేయాలని ఆసక్తి ఉంటే, నిపుణుల సలహా సూచనలు తీసుకోవడం మంచిది.


ఇవి కూడా చదవండి:

Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..


Ayodhya: రాములోరి ఆలయానికి బెదిరింపు.. భారీగా భద్రత పెంచిన ప్రభుత్వం


iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..


Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 15 , 2025 | 08:45 PM