SBI Rates Slashed: ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!
ABN , Publish Date - Feb 15 , 2025 | 07:31 PM
లోన్ తీసుకున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. రిజర్వ్ బ్యాంకు రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో ఎస్బీఐ కూడా ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేటును (ఈబీఎల్ఆర్), రెపో రేటు ఆధారిత లెండింగ్ రేట్లల్లో(ఆర్ఎల్ఎల్ఆర్) కోత పెట్టింది.

ఇంటర్నెట్ డెస్క్: లోన్ తీసుకున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. రిజర్వ్ బ్యాంకు రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో ఎస్బీఐ కూడా ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేటును (ఈబీఎల్ఆర్), రెపో రేటు ఆధారిత లెండింగ్ రేట్లల్లో(ఆర్ఎల్ఎల్ఆర్) కోత పెట్టింది. ఈబీఎల్ఆర్‌ను 9.15 శాతం నుంచి 8.90 శాతానికి తగ్గించింది. దీంతో, వినియోగదారులకు లోన్‌లపై వడ్డీ భారం మరింతగా తగ్గనుంది. ఇక సవరించిన వడ్డీ రేట్లు నేటి నుంచీ అమల్లోకి వచ్చాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఆర్‌బీఐ రెపో రేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే (SBI).
Edible Oil: గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
రెపో రేటు తగ్గడంతో బ్యాంకులు ఈ మేరకు వడ్డీలో కొతను వినియోగదారులకు బదిలీ చేశాయి. అనేక బ్యాంకు తమ రెపో ఆధారిత రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించాయి. కెనరా బ్యాంకు ఆర్ఎల్ఎల్ఆర్‌ను 9.25 శాతం నుంచి 9.00కి తగ్గించింది. కొత్తగా తెరిచే లోన్ అకౌంట్లకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుందని వెల్లడించింది. మూడేళ్లు పూర్తి చేసుకున్న లోన్ అకౌంట్లకూ ఇది వర్తిస్తుందని సంస్థ వెబ్‌సైట్‌లోని ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా సవరించిన 8.90 శాతం ఆర్ఎల్ఎల్‌ఆర్‌ను ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ వడ్డీ రేటును 9.35 శాతం నుంచి 9.10 శాతానికి తగ్గించింది. ఈ నెల 11 నుంచి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు కూడా సవరించిన 9.10 శాతం వడ్డీ రేటును అమల్లోకి తెచ్చింది.
RBI Restrictions: నిధుల ఉపసంహరణపై ఆర్‌బీఐ ఆంక్షలు.. ఇబ్బంది పడుతున్న కస్టమర్లు
ఎమ్‌సీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ తదితర రేట్ల ఆధారంగా బ్యాంకులు వినియోగదారులకు ఇచ్చే లోన్ల వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయన్న విషయం తెలిసిందే. వడ్డీ రేట్లను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్కుకు అనుసంధానించాలన్న ఆర్బీఐ ఆదేశాల మేరకు 2019 నుంచి బ్యాంకులు ఈబీఎల్ఆర్ అమలు చేస్తున్నాయి. రిటైల్ కస్టమర్లకు, ఎమ్ఎస్ఎమ్‌ఈ సంస్థలకు ఇచ్చే లోన్ల వడ్డీ రేట్లను బ్యాంకులు ఎమ్‌సీఎల్ఆర్ ఆధారంగా నిర్ణయిస్తాయి. ఇక అధిక శాతం మంది తీసుకునే ఫోటింగ్ రేట్ ఆధారిత లోన్లను ఆర్ఎల్ఎల్ఆర్ ప్రభావితం చేస్తుంది. ఇందులో హెచ్చుతగ్గుల ఆధారంగా చెల్లించాల్సిన వడ్డీలోనూ మార్పులు కనిపిస్తాయి. ఎమ్‌సీఎల్ఆర్‌తో పాటు ఆర్‌బీఐ బేస్ రేటు, ప్రైమ్ లెండింగ్ రేటు ఆధారంగా కనిష్ఠ వడ్డీ రేటును బ్యాంకులు నిర్ణయిస్తాయి.
Read More Business News and Latest Telugu News