SEBI: ఆప్షన్ ట్రేడింగ్ అక్కడే కొంప ముంచుతోంది : సెబీ ఛైర్మన్
ABN , Publish Date - Mar 23 , 2025 | 07:05 PM
ఎఫ్ అండ్ ఓ మదుపర్లపై చాలా కాలంగా ఇవే తరహా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎఫ్ అండ్ ఓ ట్రేడర్లు భారీ స్థాయిలో నష్టాల పాలు కావడం లెక్కలతో సహా..

ముంబై, మార్చి 23: స్టాక్ మార్కెట్లోని ఎఫ్ అండ్ ఓ (F&O) ట్రేడింగ్‌పై కొత్త సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే(Tuhin Kanta Pandey) కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ట్రేడర్ల అతి విశ్వాసం, ముఖ్యంగా గడువు(expiry days)ముగిసే కొన్ని నిమిషాల ముందు మార్కెట్లోకి ప్రవేశించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ (Futures and Options) సిగ్మెంట్లో ట్రేడింగ్ చేస్తున్న రిటైల్ ఇన్వెస్టర్ల గురించి ఇప్పటికే అనేక పర్యాయాలు సెబీ మాజీ చీఫ్ మాధబి పూరి బుచ్ కూడా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఎఫ్ అండ్ ఓ మదుపర్లపై చాలా కాలంగా ఇవే తరహా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎఫ్ అండ్ ఓ ట్రేడర్లు భారీ స్థాయిలో నష్టాల పాలు కావడం లెక్కలతో సహా చూపిస్తున్నారు.
తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను పొందొచ్చనే ఆలోచనే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడర్ల నష్టాలకు ఒక కారణమని అభిప్రాయపడ్డారు సెబీ కొత్త చీఫ్. బిజినెస్ టుడే మైండ్‌రష్ 2025 ఫోరమ్‌లో పాల్గొన్న పాండే తన అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు. ఈ విభాగాల్లో నూటికి 90 శాతం మంది రిటైల్ పెట్టుబడిదారులు డబ్బును కోల్పోతున్నారన్నారు. మిగిలిన పదిశాతం మందీ కూడా బ్రోకరేజ్, ఇతర చార్జీల పోగా వచ్చేవి కంటితుడుపు లాభాలేనన్నారు. ఎఫ్‌అండ్ఓ ట్రేడింగ్ పై సెబీ ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసిందని.. పరిశ్రమ వర్గాల అభిప్రాయం ఆధారంగా వీటి పరిష్కారాలపై పనిచేస్తోందని చెప్పారు. డెరివేటీవ్స్ ట్రేడింగ్‌తో పాటు, ఈక్విటీ పెట్టుబడిదారులకు సంబంధించి సెబీ అమలు చేస్తున్న వివిధ చర్యల గురించి పాండే వివరించారు.
Also Read:
గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..
KTR: కేటీఆర్ కాన్వాయ్‌లో అపశ్రుతి
IPL 2025: టాస్ ఓడిన సన్‌రైజర్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరంటే..
For More Business News and Telugu News..