హైదరాబాద్‌లో సొనోకో జీసీసీ
ABN , Publish Date - Jan 29 , 2025 | 02:07 AM
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) ఏర్పాటు చేస్తోంది. పలు ఫార్చ్యూన్-500 కంపెనీలకు ప్యాకేజింగ్ ఉత్పత్తులు సరఫరా చేస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థ సొనోకో...

500 మందికి ఉద్యోగాలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) ఏర్పాటు చేస్తోంది. పలు ఫార్చ్యూన్-500 కంపెనీలకు ప్యాకేజింగ్ ఉత్పత్తులు సరఫరా చేస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థ సొనోకో ‘పెర్‌ఫార్మెన్స్ హబ్’ పేరుతో ఈ జీసీసీని ఏర్పాటు చేస్తోంది. హైటెక్ సిటీ సమీపంలోని ఫీనిక్స్ కార్యాలయ భవనంలో కోటి డాలర్ల (సుమారు రూ.86 కోట్లు) పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం ద్వారా వచ్చే ఏడాది, ఏడాదిన్నర కాలంలో 300 నుంచి 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని సొనోకో చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి (సీఐఓ) రాజీవ్ అంకిరెడ్డిపల్లి తెలిపారు. ఇందులో ఇప్పటికే 60-70 మంది నియామకాలను కంపెనీ పూర్తి చేసింది, క్యాపబిలిటీ, కెపాసిటీ, కాస్ట్ అంశాల ప్రాతిపదికన సొనోకో హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా ఈ కేంద్రా న్ని ఏర్పాటు చేస్తోంది.
ఈ కేంద్రం ద్వారా తమ కంపెనీతో పాటు తమ ఖాతాదారులకు అవసరమైన డిజిటల్ సేవలు అందిస్తామని రాజీవ్ చెప్పారు. పర్యావరణానికి హాని చేయని రీతిలో ప్యాకేజింగ్ ఉత్పత్తులు అందించడం తమ కంపెనీ ప్రత్యేకత అన్నారు. ప్రస్తుతం నిపుణులైన ఉద్యోగులు భారత్‌లో లభిస్తున్నంత విరివిగా మరే దేశంలోనూ లభించడం లేదని సొనోకో కంపెనీ గ్లోబల్ ఐటీ సేవల విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జొచెన్ లీ లార్జ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Read More Business News and Latest Telugu News