టాటా క్యాపిటల్ రూ.17,000 కోట్ల ఐపీఓ
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:08 AM
టాటా గ్రూప్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ.. టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ మేరకు కంపెనీ ఈ నెల 4న మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి...

కాన్ఫిడెన్షియల్ ప్రీ-ఫైలింగ్ విధానంలో సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు
టాటా గ్రూప్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ.. టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ మేరకు కంపెనీ ఈ నెల 4న మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి కాన్ఫిడెన్షియల్ ప్రీ-ఫైలింగ్ విధానంలో ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఐపీఓ ద్వారా కంపెనీ దాదాపు 200 కోట్ల డాలర్లు (సుమారు రూ.17,000 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా టాటా క్యాపిటల్ విలువను 1,100 కోట్ల డాలర్లు (రూ.93,500 కోట్లు)గా లెక్కగట్టినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇష్యూలో భాగంగా రూ.10 ముఖ విలువతో కూడిన కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయటంతో పాటు కొంత మంది వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) రూపంలో తమ వాటాలను విక్రయించనున్నట్లు ముసాయిదా పత్రాల్లో టాటా క్యాపిటల్ వెల్లడించింది. అప్పర్ లేయర్ ఎన్‌బీఎ్‌ససీ సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాలన్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిబంధనలకు అనుగుణంగా టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది.
ప్రస్తుతం టాటా క్యాపిటల్‌లో హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌కు 92.83 శాతం వాటా ఉంది. రెండేళ్ల వ్యవధిలో టాటా గ్రూప్ నుంచి వస్తున్న రెండో ఐపీఓ ఇది. 2023లో టాటా టెక్నాలజీస్ స్టాక్ మార్కెట్లో లిస్టయిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
BSNL: పుంజుకున్న బీఎస్ఎన్ఎల్, కొత్తగా 55 లక్షల మంది కస్టమర్లు..మొత్తం ఎంతంటే..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News